సహకారానికి మాత్రమే అంతరిక్షం వేదిక కావాలి
యునైటెడ్ నేషన్స్: అంతరిక్షం ఆయుధ పోటీకి వేదిక కాకుండా నివారించేందుకు చట్టబద్ధమైన అంతర్జాతీయ ఏర్పాటు ఒకటి అవసరమని భారత్ స్పష్టం చేసింది. దేశాల పరస్పర సహకారానికి మాత్రమే అంతరిక్షం వేదిక కావాలని, ఘర్షణకు కాదని రాజ్యసభ సభ్యులు సుధామూర్తి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఫస్ట్ కమిటీ ముందు భారతదేశ వాణిని వినిపిస్తూ... ‘‘భారత అంతరిక్ష కార్యక్రమాలకు ఒకవైపున అభివృద్ధి.. రెండో వైపున భద్రతకు సంబంధించిన అంశాలున్నాయి’’ అని చెప్పారు.
అంతరిక్షం అందరిదని భారత్ విశ్వసిస్తోందని, ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు అన్న భావన కలిగి ఉందని వివరించారు. అంతరిక్ష రంగంలో ఇప్పుడు కొంతమంది కొత్తవాళ్లు ప్రవేశించిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ.. రెండు రకాలుగానూ ఉపయోగించుకోగలిగే టెక్నాల జీలు, వ్యవస్థలు వాస్తవరూపం దాల్చాయని అన్నారు. భారత్ అంతరిక్షంలో ఆయుధాల పోటీని నివారించేందుకు చట్టపరంగా బలమైన ఒప్పందాన్ని కోరుతోంది అని స్పష్టం చేశారు. వివక్ష, ‘స్వచ్ఛందంగా అమలు చేయాల్సిన నియమాలు’ లేని, అందరిలోనూ విశ్వాసం కలిగించే ఏర్పాట్లూ భారత్‌కు అంగీకార మైనప్పటికీ ఇవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన (చట్టబద్ధమైన) ఏర్పాటుకు ప్రత్యామ్నయం కాదని తెలిపారు.
ఇదీ చదవండి: రూ.800కి సేల్స్‌మేన్ : క్లీనర్‌కి లంబోర్ఘిని ఇచ్చి, హైదరాబాదీ గొప్ప మనసు


