'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్, నటి జ్యోతి పూర్వజ్ (Jyoti Poorvaj) ప్రధాన పాత్రలో నటించిన 'కిల్లర్' (KilleR) మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 21న హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో ఘనంగా జరిగింది.
పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.
ఈ సినిమా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ మూవీలోని ట్విస్ట్‌ను కరెక్ట్‌గా గెస్ చేసిన వారికి రూ. 1 కోటి బహుమతి ఇస్తామని జ్యోతి పూర్వజ్ ఈ ఈవెంట్లో ప్రకటించారు.
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, మనీష్ గిలాడ, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్ తదితరులు నటించారు.


