2028 అధ్యక్ష రేసు: జేడీ వాన్స్‌కు మద్దతుపై ట్రంప్ దాటవేత! | Trump avoids endorsing JD Vance for 2028 presidential race | Sakshi
Sakshi News home page

2028 అధ్యక్ష రేసు: జేడీ వాన్స్‌కు మద్దతుపై ట్రంప్ దాటవేత!

Oct 22 2026 11:26 AM | Updated on Oct 22 2026 11:26 AM

Trump avoids endorsing JD Vance for 2028 presidential race

వాషింగ్టన్‌: 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున తన వారసుడిగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు మద్దతు ఇచ్చే అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, వాన్స్ ఎంతో సమర్థుడైన నాయకుడని ప్రశంసించినప్పటికీ, 2028 అభ్యర్థిత్వంపై తమ మధ్య ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.
 

ప్రస్తుతం తమ దృష్టంతా రాబోయే నవంబర్ 3 మధ్యంతర ఎన్నికలపైనే ఉందని, ఈ సమయంలో ఎవరికైనా మద్దతు ప్రకటించడం చాలా తొందరపాటు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగ నిబంధనల ప్రకారం రెండు పర్యాయాల పరిమితి ఉండటంతో ట్రంప్ పదవీకాలం 2028తో ముగియనుంది. ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే దేశ బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని గతంలో వాన్స్ వ్యాఖ్యానించినప్పటికీ, తాజా ప్రెస్ మీట్‌లో ట్రంప్ సమాధానాన్ని దాటవేయడంతో 2028 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ఎవరనే దానిపై రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: పాక్‌లోనే దావూద్.. ఐరాస నివేదికపై భారత్ ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement