కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘అక్క’. యష్‌రాజ్ ఫిలింస్ సమర్పణలో ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ అక్టోబరు 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
గ్యాంగ్ లీడర్‌గా
ఈ సిరీస్‌లో కీర్తి సురేశ్ గ్యాంగ్ లీడర్‌గా కనిపించనున్నారు. తన గ్యాంగ్‌తో కలిసి దందాలు చేస్తూ అందరినీ భయపెట్టే ‘అక్క’ పాత్రలో ఆమె నటిస్తున్నారు. మరోవైపు.. ఆమె గ్యాంగ్‌ను అంతమొందించేందుకు సుపారీ తీసుకొని వచ్చిన మహిళగా రాధికా ఆప్టే కనిపించనున్నారు. ఈ ఇద్దరు నటీమణుల మధ్య జరిగే పోరాటం, ఉత్కంఠభరిత సన్నివేశాలు ట్రైలర్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.
కథలో కీలక మలుపులు, యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కీర్తి సురేశ్, రాధికా ఆప్టే తమ పాత్రల్లో ఎలా ఆకట్టుకుంటారో తెలియాలంటే అక్టోబరు 30 వరకు వేచి చూడాల్సిందే.
(ఇదీ చదవండి: ‘రియాలిటీ’ నుంచి కొత్త పాట రిలీజ్)


