న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే 30 సంవత్సరాల వరకు అధికారంలోకి వచ్చే అవకాశం మీకు రాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారని, అందుకే తన మాటలు ఆయనకు వినపడకపోవచ్చని పేర్కొన్న షా, ఆయన ఎందుకు విదేశాల్లో ఉన్నారనేది ఆయన వ్యక్తిగత విషయమని అన్నారు.
दिल्ली में यमुना सफाई के परियोजनाओं के शिलान्यास के वक्त अमित शाह ने कहा ''धरना-प्रदर्शन से कुछ नहीं होता.. जहां से चुनकर आए हैं..वहां के लोगों के लिए काम कीजिए.. पंजाब की जनता ने तय कर लिया है कि पंजाब में इस बार NDA की सरकार बनेगी.. 2029 तक पंजाब से नशे के व्यापार को साफ कर देंगे''- गृहमंत्री #NDA #DrugFreePunjab #AmitShah #Homeminister #RahulGandhi #Punjab
— AajTak (@aajtak) October 22, 2026
అయితే రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత తన మాటలను గుర్తుపెట్టుకోవాలని, భవిష్యత్తులో వారికి ఎలాంటి అవకాశం లభించదని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)కి సంబంధించి సుమారు రూ.8,941 కోట్ల విలువైన 43 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ధర్నాలు, ఆందోళనలు చేయడం వల్ల ఏమీ సాధించలేరని, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు తమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో పంజాబ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని, అక్కడి ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.


