టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్‌గా డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. గ్లోబల్ హిట్ రియాలిటీ ఫార్మాట్ ఆధారంగా ‘ది ట్రైటర్స్ తెలుగు’ ట్రైలర్‌ను ప్రైమ్ వీడియో తాజాగా విడుదల చేసింది. 20 మంది ప్రముఖ సెలబ్రిటీలతో సాగే ఈ మైండ్ గేమ్ షో అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బిగ్‌బాస్‌కు భిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ షోలో విజేతకు భారీ ప్రైజ్‌మనీ ఉండటంతో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. మరి ఈ షోలో పాల్గొంటున్న ఆ 20 మంది ఎవరు? అసలు ‘ది ట్రైటర్స్’ కాన్సెప్ట్ ఏంటి?

20 మంది సెలబ్రిటీల లిస్ట్
ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, పాపులర్ యాక్టర్ హర్షవర్ధన్, తెలుగు సీనియర్ నటి ప్రగతి మహావది, నటుడు విష్ణు ఓయ్, కమెడియన్ విద్యుల్లేఖా రామన్ ఇందులో మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నారు. వీరితో పాటు నిఖిల్ విజయేంద్ర సింహ, శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకార్ అగస్తి, ఆషికా పదుకోన్, వర్ష డిసౌజా, ప్రణవ్ (అభినవకవి), ఎస్ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనంజయ్, ఫల్గుణి బంగేరా ఈ క్రేజీ గేమ్ ఆడనున్నారు.
'ది ట్రైటర్స్' కాన్సెప్ట్ ఏంటి?
గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించిన ఇంటర్నేషనల్ రియాలిటీ ఫార్మాట్ ఆధారంగా ఈ ‘ది ట్రైటర్స్’ షో రూపొందింది. హిందీ వర్షన్ సక్సెస్ సాధించిన తర్వాత, ఇప్పుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప్రైమ్ వీడియో దీనిని సరికొత్తగా డిజైన్ చేసింది. ఈ షోలో పాల్గొనే 20 మంది సెలబ్రిటీలను 'ఇన్నోసెంట్స్', 'ట్రైటర్స్' అని రెండు గ్రూపులుగా విడదీస్తారు. సీక్రెట్‌గా ఉండే 'ట్రైటర్స్' ఎవరనేది కనిపెట్టడం ఇన్నోసెంట్స్ ముందున్న అసలు ఛాలెంజ్. ఒకరినొకరు నమ్మడం, వెన్నుపోటు పొడవడం, సైకలాజికల్ మైండ్ గేమ్‌లతో నామినేట్ చేసుకోవడం లాంటి ఊహించని ట్విస్టులు ఈ 10 ఎపిసోడ్లలో రచ్చ చేయబోతున్నాయి. ప్రతీ సంభాషణ ఒక క్లూ ఇవ్వచ్చు, లేదా తప్పుడు వ్యక్తిని ప్రమాదంలో పడేయవచ్చు. 10 ఎపిసోడ్లుగా సాగే ఈ షోలో ప్రేక్షకులకు వరుస ట్విస్టులు ఎదురుకానున్నాయి.
(ఇదీ చదవండి: స్టేటస్ కోసం ఐఫోన్ కొంటున్నారా..? హీరో విజయ్ సూచనలు ఇవే..)


