స్టేటస్‌ కోసం ఐఫోన్‌ కొంటున్నారా..? హీరో విజయ్‌ సూచనలు ఇవే.. | Vijay Deverakonda Spoke About Avoid Expensive IPhones On EMI | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda iPhone: బిగ్‌ బెలియన్‌ డేస్‌ ఆఫర్స్‌.. విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Oct 6 2026 5:11 PM | Updated on Oct 6 2026 5:31 PM

Vijay Deverakonda Spoke About Avoid Expensive IPhones On EMI

స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు కేవలం అవసరం మాత్రమే కాదు.. చాలామందికి స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఐఫోన్‌ విషయంలో ఈ క్రేజ్‌ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. కొత్త మోడల్‌ మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు.. దాన్ని కొనుగోలు చేసి సోషల్‌ మీడియాలో చూపించాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అప్పులు చేసి మరీ ఖరీదైన ఫోన్లు కొనేవారు కూడా ఉన్నారు. మరో కొద్ది రోజుల్లో బిగ్‌బెలియన్‌ డేస్‌ అంటూ ఆఫర్లు రానున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌ దేవరకొండ ఇటీవల చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

‘కొత్త ఫోన్‌ ఎందుకు?’
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండకు తన స్మార్ట్‌ఫోన్‌ గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. విరాట్‌ కోహ్లీ వంటి పలువురు ప్రముఖులు కొత్త మోడళ్లు వచ్చినా పాత ఐఫోన్లనే ఉపయోగిస్తున్న విషయాన్ని యాంకర్‌ ప్రస్తావించారు.  మీరు కూడా మంచి సంపాదన ఉన్న నటుడే కదా.. మరి కొత్త ఫోన్‌ ఎందుకు కొనడం లేదని విజయ్‌ని ప్రశ్నించారు. దీనికి విజయ్‌ ప్రస్తుతం తన దగ్గర ఉన్న ఫోన్‌ బాగానే పనిచేస్తోందని, అది తన అవసరాలను తీర్చుతున్నప్పుడు కొత్త ఫోన్‌ కొనాల్సిన అవసరం ఏముందని బదులిచ్చారు.

(ఇదీ చదవండి: ‘40 సినిమాలకు డైలాగ్స్‌ రాశా.. 500 చిత్రాల్లో నటించా.. కానీ..’)

సెలబ్రిటీలకు ఉచితంగానే..
అయితే పెద్ద హీరోలు, ప్రముఖులకు పలు సంస్థలు ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఇతర ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇస్తుంటాయని చెప్పారు. అందుకే సెలబ్రిటీలు ఉపయోగించే ప్రతి వస్తువును వారు సొంత డబ్బుతో కొనుగోలు చేస్తారని భావించకూడదని స్పష్టం చేశారు.

అప్పు చేసి ఖరీదైన ఫోన్‌ కొనొద్దు..
ఖరీదైన ఫోన్‌ కొనుగోలు చేసి దాన్ని సోషల్‌ మీడియాలో చూపించుకోవాలనే ఆలోచనపై కూడా విజయ్‌ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇంటి ఖర్చులను కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితుల్లో కేవలం స్టేటస్‌ కోసం అప్పు చేసి ఖరీదైన ఫోన్‌ కొనడం సరైన నిర్ణయం కాదని అన్నారు. నిజంగా అవసరమైతేనే డబ్బు ఖర్చు చేయాలని.. కేవలం ఇతరులకు చూపించుకోవడం కోసం అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదన్న సందేశాన్ని విజయ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ‘ఫోన్‌ విషయంలో విజయ్‌ ఆలోచన కరెక్ట్‌’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement