‘40 సినిమాలకు డైలాగ్స్‌ రాశా.. 500 చిత్రాల్లో నటించా.. కానీ..’ | Senior Actor LB Sriram Emotional Speech At Garividi Lakshmi Trailer Launch Event | Sakshi
Sakshi News home page

LB Sriram: సినిమాలు వదిలేయలేదు.. అవకాశాలే రావడం లేదు: సీనియర్‌ నటుడు

Oct 6 2026 1:32 PM | Updated on Oct 6 2026 2:20 PM

Senior Actor LB Sriram Emotional Speech At Garividi Lakshmi Trailer Launch Event

టాలీవుడ్‌లో తనదైన నటన, రచనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్‌. ఎన్నో సినిమాల్లో  వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించి, మెప్పించిన ఆయన.. కొంతకాలంగా వెండతెరకు దూరంగా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంతే కాకుండా తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

10 నుంచి 15 ఏళ్లు రంగస్థలంపై..
‘సినిమాల్లో రాకముందు దాదాపు 10 నుంచి 15 ఏళ్లు రంగస్థలంపై నటించాను. నాటకరంగంలో ఎంతో అనుభవం సంపాదించిన తర్వాతే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఆ అనుభవంతోనే నటుడిగా దాదాపు 500 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం లభించింది. ‘హలో బ్రదర్‌’, ‘హిట్లర్‌’  ఇలా సుమారు 40 సూపర్‌హిట్‌ చిత్రాలకు డైలాగ్స్‌ రాశాను. ప్రస్తుతం స్థాయికి తగ్గట్లుగా నటించేందుకు సరైన పాత్రలు రావడం లేదు. అందుకే వెండి తెరకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నా. దీంతో యూట్యూబ్‌లో షార్ట్‌ఫిలిమ్స్‌ చేస్తున్నాను. కమర్షియల్‌ సినిమాల్లో అవకాశాలు తగ్గినా.. డిజిటల్‌ కంటెంట్‌ ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటా’ అని ఎల్బీ శ్రీరామ్‌ భావోద్వేగంగా మాట్లాడారు.

‘గరివిడి లక్ష్మి’ సినిమాతో.. 
కాగా ఎల్బీ శ్రీరామ్‌ ‘గరివిడి లక్ష్మి’ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన ‘బుర్రకథ గురువు’ పాత్రలో కనిపించనున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆనంది ప్రధాన పాత్రలో నటించారు.  ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: మెగా, నందమూరి మల్టీస్టారర్.. దర్శకుడిగా బోయపాటి రెడీ!)
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement