బిగ్‌బాస్‌ని మించిన షో.. ఏకంగా రూ. కోటి ప్రైజ్‌మనీ! ట్రైలర్‌ | The Traitors Telugu Trailer Teja Sajja Brings Authority to PrimeVideo | Sakshi
Sakshi News home page

The Traitors Telugu Trailer: తేజ సజ్జా ‘ది ట్రైటర్స్‌’ ట్రైలర్‌ చూశారా?

Oct 6 2026 6:09 PM | Updated on Oct 6 2026 6:41 PM

The Traitors Telugu Trailer Teja Sajja Brings Authority to PrimeVideo

తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి రియాలిటీ గేమ్‌ షో ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ షో నాలుగు వారాల పాటు తెలుగు భాషలో ఇంగ్లిష్‌ సబ్‌ టైటిల్స్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అక్టోబరు 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. పది ఎపిసోడ్స్‌తో  ఈ సిరీస్‌లో రూపొందుతోంది. మోసం, మారుతున్న స్నేహాలు, ఊహించని ట్విస్టులతో సాగనున్న ‘ది ట్రైటర్స్‌ తెలుగు’ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ షో మరింత ఆసక్తికరంగా సాగనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఈ రియాలిటీ షోలో వివిధ రంగాలకు చెందిన 20 మంది ప్రముఖులు పాల్గొన్నారు. చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్‌, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్‌ విజయేంద్ర సింహా, విద్యు రామన్‌, విష్ణు ఓయ్‌, శ్రావ్య వర్మ, డా. మేఘనాథ్‌ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్‌ అగస్తి, ఆశికా పదుకొనే, వర్షా డిసౌజా, ప్రణవ్‌ అలియాస్‌ అభినవకవి, ఎస్‌ఎస్‌ వర్ధన్‌, రహత్‌ ఆచంట, గౌరవ్‌ సునీల్‌, సాయి రోనక్‌, పుప్పాల ధనుంజయ, ఫల్గుణి బంగేరా ఇందులో కనిపించనున్నారు.

ఎవరు ట్రైటర్స్‌.. ఎవరు ఇన్నోసెంట్స్‌?
షోలో కొందరు ‘ట్రైటర్స్‌’గా, మరికొందరు ‘ఇన్నోసెంట్స్‌’గా వ్యవహరిస్తారు. తమ మధ్య దాగి ఉన్న ట్రైటర్స్‌ను ఇన్నోసెంట్స్‌ గుర్తించాలి. అయితే ఎవరిని నమ్మాలో, ఎవరిని అనుమానించాలో తెలియని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతి సంభాషణ, ప్రతి స్నేహం, ప్రతి కూటమి వెనుక ఏదో ఒక వ్యూహం ఉండేలా ట్రైలర్‌ను రూపొందించారు. ట్రైలర్‌లో కంటెస్టెంట్ల మధ్య అనుమానాలు, వాగ్వాదాలు, ఉత్కంఠభరితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే షోలోని అసలు ట్విస్టులను మాత్రం బయటపెట్టకుండా ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను కట్‌ చేశారు. ఊహించని మలుపులతో సాగే ఈ రియాలిటీ షోలో తేజ సజ్జ హోస్టింగ్‌ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

(ఇదీ చదవండి: స్టేటస్‌ కోసం ఐఫోన్‌ కొంటున్నారా..? హీరో విజయ్‌ సూచనలు ఇవే..)


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement