సెహ్వాగ్‌కు కొత్త పంచాయితీ..! దుస్తులు చింపి.. ఆపై.. | Rise And Fall 2 Siwet Tomar Fight With Shehzad Poonawala In Virender Sehwag Show | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్‌ షోలో కొత్త పంచాయితీ.. తొలిరోజే పెద్ద గొడవ

Sep 28 2026 7:27 PM | Updated on Sep 28 2026 7:34 PM

Rise And Fall 2 Siwet Tomar Fight With Shehzad Poonawala In Virender Sehwag Show

భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘రైజ్ అండ్ ఫాల్ 2’. ప్రారంభమైన తొలిరోజే వివాదంలో చిక్కుకుంది. షోలో ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఓ కంటెస్టెంట్‌ మరో కంటెస్టెంట్‌పై దాడి చేయడంతో పాటు అతడి దుస్తులు చింపిన ఘటన కలకలం రేపింది.

15 మంది కంటెస్టెంట్లతో..
15 మంది కంటెస్టెంట్లతో ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. నటి స్వరా భాస్కర్‌, ప్రియాంక చాహర్‌ చౌదరి, కరణ్‌ పాటిల్‌, గౌతమ్‌ గులాటీ, షెహజాద్‌ పూనావాలా, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, కాజల్‌ రఘ్‌వాణి, అనీష్‌ భగత్‌, ఇరినా రుడకోవ్‌, కైరా అను, మనీశ్‌ కశ్యప్‌, నిహారిక తివారి, రాజ్‌ గ్రోవర్‌, సారా గుర్పాల్‌, సివెట్‌ తోమర్‌ ఈ సీజన్‌లో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టారు.
మొదటిరోజే..
అయితే తొలిరోజే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా, టీవీ సెటబ్రిటీ సివెట్‌ తోమర్‌ మధ్య వివాదం చోటుచేసుకుంది. షెహజాద్‌ పూనావాలా చేసిన ఓ వ్యాఖ్యతో ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ‘టాటూ వేసుకుని స్వరా భాస్కర్‌తో కలిసి తిరుగుతున్నాడు’ అంటూ షెహజాద్‌ వ్యాఖ్యానించినట్లు వీడియోలో కనిపించింది. దీంతో స్వరా భాస్కర్‌ అతడిని నిలదీసే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో అక్కడికి వచ్చిన సివెట్‌ తోమర్‌ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. అతడిని ఆపేందుకు స్వరా భాస్కర్‌ ప్రయత్నించినప్పటికీ వినకుండా షెహజాద్‌పై దాడికి దిగాడు. ఈ ఘటనలో షెహజాద్‌ ధరించిన కుర్తీ చిరిగిపోయింది. అనంతరం అతడిపై కూర్చొని కొట్టినట్లు వీడియోలో కనిపించింది. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు కలగజేసుకుని సివెట్‌ తోమర్‌ను పక్కకు తీసుకెళ్లారు.

వీరేంద్ర సెహ్వాగ్‌కు సమస్య..
ఈ ఘటన తర్వాత సివెట్‌ తోమర్‌ను షో నుంచి బయటకు పంపినట్లు సమాచారం. హౌస్‌లో కంటెస్టెంట్‌పై దాడి చేయడాన్ని నిర్వాహకులు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై షో నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ‘రైజ్ అండ్ ఫాల్ 2’లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తొలిసారి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వీరేంద్ర సెహ్వాగ్‌కు ప్రారంభంలోనే ఇలాంటి వివాదం ఎదురుకావడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. కన్నీరుపెట్టుకున్నా: రాజమౌళి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement