‘అమ్మ ఉంది ఆకలి తీర్చడానికి.. బెగ్గింగ్‌కి కాదు’.. స్లమ్‌డాగ్‌ గ్లింప్స్‌ | Zareena Wahabs Look from Puri Jagannadh Slum Dog Glimpse | Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతి ‘స్లమ్‌ డాగ్‌’ గ్లింప్స్‌

Sep 28 2026 2:33 PM | Updated on Sep 28 2026 2:44 PM

Zareena Wahabs Look from Puri Jagannadh Slum Dog Glimpse

దర్శకుడు పూరి జగన్నాథ్‌, తమిళ హీరో విజయ్‌ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్‌ రోడ్‌’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్రబృందం మరో ఆసక్తికరమైన అప్‌డేట్‌ను పంచుకుంది. సీనియర్‌ నటి జరీనా వహాబ్‌ ఈ సినిమాలో ‘జుబైదా’ అనే కీలక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. 

ఈ సందర్భంగా ‘జుబైదాగా జరీనా వహాబ్‌’ అంటూ ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు.  అమ్మ ఉంది ఆకలి తీర్చడానికి.. బెగ్గింగ్‌ చేసుకోడానికి కాదు.. అనే డైలగ్‌ ఆలోచింపజేస్తోంది. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి మొదలైంది.

‘స్లమ్ డాగ్ 33 టెంపుల్‌ రోడ్‌’లో విజయ్‌ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తోంది. సీనియర్‌ నటి టబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్‌ మార్క్‌ కథనం, విజయ్‌ సేతుపతి నటనతో పాటు ఇంతమంది ప్రముఖ నటీనటులు భాగం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చదవండి: నాని ది ప్యారడైజ్. కలెక్షన్స్‌లో అదే హవా..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement