నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్.’ ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటకీ ఈ సినిమా ప్రపంచం వ్యాప్తంగా 135 కోట్లు వసూళ్లు రాబెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా కేటీఆర్ శైతం సినిమాను థియేటర్‌కి వెళ్లి చూశారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించారు. చిత్రం బృందాన్ని అభినందించారు. కాగా మరోసారి ది ప్యారడైజ్‌పై స్పందించిన ఆయన.. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యంలు వైరల్ అవుతున్నాయి.
ఇదీ చదవండి: సాయి పల్లవి స్పీచ్‌కి ఫ్యాన్స్ ఫిదా
సినిమాలో 4 నిమిషాలు..
ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్‌లో పార్టీ నేతలతో కలిసి తాను ‘ది ప్యారడైజ్’ సినిమా చూసిన విషయాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు గంటల నిడివి ఉన్న ఆ సినిమాలో కేసీఆర్‌ను ప్రతిబింబించే ఎమ్మెల్యే శంకరన్న పాత్ర కనిపించేది కేవలం నాలుగు నిమిషాలే. కానీ ఆ మూడు గంటలు ఒక ఎత్తు అయితే.. ఆ నాలుగు నిమిషాలు మరో ఎత్తు. ఆ పాత్ర తెరపై కనిపించినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన వేరే లెవల్‌లో ఉంది’ అని తెలిపారు. సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు తమ ఉనికి, అస్తిత్వం కోసం చేసే తిరుగుబాటును డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అద్భుతంగా ఆవిష్కరించారన్నారు.
ఇదీ చదవండి: ది ప్యారడైజ్ పై కేటీఆర్ రివ్యూ
"మూడు గంటల #TheParadise సినిమా ఒక ఎత్తు...
అందులో ఉన్న నాలుగు నిమిషాల #KCR సీన్ ఒక ఎత్తు."
– #KTR pic.twitter.com/2B286TMt81— Gulte (@GulteOfficial) September 27, 2026


