నా భార్య కనిపించట్లేదు.. ఓటీటీ కోసం కలిసిన హిట్ జోడీ | Varun Sandesh And Sweta Basu Na Wife Missing OTT Series Telugu | Sakshi
Sakshi News home page

OTT: ట్రెండింగ్ కాన్సెప్ట్‌తో తెలుగు ఓటీటీ థ్రిల్లర్

Sep 27 2026 5:38 PM | Updated on Sep 27 2026 5:47 PM

Varun Sandesh And Sweta Basu Na Wife Missing OTT Series Telugu

గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే సమాజంలో విపరీతనైన ధోరణి కనిపిస్తుంది. ప్రియుల కోసం భర్తల్ని సొంత భార్యలే రకరకాలుగా అంతా భయపడేలా చంపుతున్నారు. అదే టైంలో కొందరు భర్తలు కూడా తమ భార్యలని హత్య చేసి ఏం తెలియకుండానే మేనేజ్ చేస్తూ దొరికిపోతున్నారు. ఇలాంటి ట్రెండింగ్ కాన్సెప్ట్‌తో ఓటీటీలోకి వచ్చేందుకు ఓ తెలుగు థ్రిల్లర్ రెడీ అవుతోంది. ఈ మేరకు ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో భారీ రెమ్యునరేషన్‌! రోజుకు రూ.7.5 లక్షలు)

2008లో వచ్చిన 'కొత్త బంగారు లోకం' సినిమాతో హిట్ జోడీ అనిపించుకున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్.. తర్వాత కాలంలో వేర్వేరుగా పలు తెలుగు మూవీస్ చేసినప్పటికీ పెద్దగా పేరయితే తెచ్చుకోలేకపోయారు. వరుణ్ అడపాదడపా కనిపిస్తున్నప్పటికీ శ్వేతా బసు అయితే చివరగా 2018లో ఓ టాలీవుడ్ చిత్రంలో కనిపించింది. ఇప్పుడు వీళ్లిద్దరూ 'నా వైఫ్ మిస్సింగ్' పేరుతో తీస్తున్న సిరీస్‌లో కలిసి నటించారు.

ఆహా ఓటీటీలో త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ థ్రిల్లర్ సిరీస్‌కి సంబంధించి గ్లింప్స్ తాజాగా విడుదల చేశారు. బ్యాంక్‌లో పనిచేసే బాలు(వరుణ్ సందేశ్) అనే వ్యక్తి.. తన భార్య కనిపించట్లేదని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. ఇంతకీ ఆమె ఏమైంది? బాలునే హత్య చేశాడా? లేదంటే ఆమె ఎవరితోనైనా వెళ్లిపోయిందా? అనేది స్టోరీలా అనిపిస్తోంది. ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని చెప్పారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement