‘ఇక బ్రేక్ లేదు’ అంటూ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూట్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూ΄÷ందుతున్న చిత్రం ‘డ్రాగన్’. అయితే ఇటీవల భుజానికి అయిన గాయం కారణంగా ఎన్టీఆర్ ఈ సినిమా చిత్రీకరణకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఇన్నాళ్లూ బ్రేక్‌లో ఉన్న ఈ హీరో... అక్టోబరులో జరగనున్న ‘డ్రాగన్’ సినిమా కొత్త షెడ్యూల్‌లో ఎంటర్ కానున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే... ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో షాహిద్ కపూర్ నటించనున్నారని, లుక్ టెస్ట్ చేశారని సమాచారం. ఒకవేళ షాహిద్ కపూర్ ఈ సినిమా కోసం ఫైనలైజ్ అయితే అక్టోబరులో ఎన్టీఆర్–షాహిద్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుంది. మరోవైపు ‘డ్రాగన్’ రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది.


