breaking news
SlumDog 33 Temple Road Movie
-
‘అమ్మ ఉంది ఆకలి తీర్చడానికి.. బెగ్గింగ్కి కాదు’.. స్లమ్‌డాగ్ గ్లింప్స్
దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్రబృందం మరో ఆసక్తికరమైన అప్డేట్ను పంచుకుంది. సీనియర్ నటి జరీనా వహాబ్ ఈ సినిమాలో ‘జుబైదా’ అనే కీలక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ‘జుబైదాగా జరీనా వహాబ్’ అంటూ ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. అమ్మ ఉంది ఆకలి తీర్చడానికి.. బెగ్గింగ్ చేసుకోడానికి కాదు.. అనే డైలగ్ ఆలోచింపజేస్తోంది. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి మొదలైంది.‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’లో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తోంది. సీనియర్ నటి టబు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ మార్క్ కథనం, విజయ్ సేతుపతి నటనతో పాటు ఇంతమంది ప్రముఖ నటీనటులు భాగం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇదీ చదవండి: నాని ది ప్యారడైజ్. కలెక్షన్స్‌లో అదే హవా..! -
పోరాటాలతో నిండిన జీవితం
‘ప్రేమతో కూడిన హృదయం... పోరాటాలతో నిండిన జీవితం’ అంటూ జుబైదా పాత్రను పరిచయం చేసింది ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ చిత్రబృందం. ఈ చిత్రంలో సీనియర్ నటి జరీనా వాహబ్ పోషిస్తున్న పాత్ర పేరు జుబైదా. ఈ పాత్ర లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త హీరోయిన్గా నటిస్తుండగా, ఓ పవర్ఫుల్ రోల్‌ని టబు పోషిస్తున్నారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో దునియా విజయ్ కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు. -
విజయ్ సేతుపతి స్లమ్‌డాగ్.. పవర్ఫుల్ రోల్ గ్లింప్స్ రిలీజ్
విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ 'స్లమ్ డాగ్-33 టెంపుల్ రోడ్'. ఈ సినిమాకు టాలీవుడ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ బాలీవుడ్ భామ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టబు రోల్ పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ చూస్తుంటే టబు పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డేగా కనిపించనుంది. ఈ చిత్రంలో టబు రోల్ హైలెట్‌గా ఉండనుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. 'మా ఓల్డ్ సిటీలో ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం' అనే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఈ మూవీలో సంయుక్త, దునియా విజయ్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు.


