పోరాటాలతో నిండిన జీవితం  | SlumDog 33 Temple Zarinawahab look release | Sakshi
Sakshi News home page

పోరాటాలతో నిండిన జీవితం 

Sep 28 2026 4:35 AM | Updated on Sep 28 2026 4:35 AM

SlumDog 33 Temple Zarinawahab look release

‘ప్రేమతో కూడిన హృదయం... పోరాటాలతో నిండిన జీవితం’ అంటూ జుబైదా పాత్రను పరిచయం చేసింది ‘స్లమ్‌ డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’ చిత్రబృందం. ఈ చిత్రంలో సీనియర్‌ నటి జరీనా వాహబ్‌ పోషిస్తున్న పాత్ర పేరు జుబైదా. ఈ పాత్ర లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. 

విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా యాక్షన్‌ మూవీ ‘స్లమ్‌ డాగ్‌: 33 టెంపుల్‌ రోడ్‌’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా, ఓ పవర్‌ఫుల్‌ రోల్‌ని టబు పోషిస్తున్నారు.

 నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో దునియా విజయ్‌ కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్, కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement