ది ట్రూత్‌ సిరీస్‌  | Vijay Devarakonda Ranabaali movie releasing on 16 October 2026 | Sakshi
Sakshi News home page

ది ట్రూత్‌ సిరీస్‌ 

Sep 28 2026 4:12 AM | Updated on Sep 28 2026 4:12 AM

Vijay Devarakonda Ranabaali movie releasing on 16 October 2026

విజయ్‌ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటించిన తాజా సినిమా ‘రణబాలి’. టీ సిరీస్‌ సమర్పణలో రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం విజయ దశమి సందర్భంగా అక్టోబరు 16న విడుదల కానుంది. ఈ మూవీలో రణబాలి పాత్రలో విజయ్‌ దేవరకొండ, జయమ్మ పాత్రలో రష్మికా మందన్నా, సర్‌ థియోడర్‌ హెక్టర్‌గా ఆర్నాల్డ్‌ వోస్లూ నటించారు. 

19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ తెరకెక్కింది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ‘నెవర్‌ ఫర్‌గాట్‌: ది ట్రూత్‌ సిరీస్‌’ అనే డాక్యుమెంటరీని నాలుగు విభాగాలుగా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. యూట్యూబ్‌ వేదికగా ఈ నాలుగు ఎపిసోడ్స్‌ స్ట్రీమింగ్‌ కానున్నాయి. తొలి ఎపిసోడ్‌ ‘ది ఫెమైన్‌ వుయ్‌ ఫర్‌గాట్‌’ నేడు (సెప్టెంబరు 28) స్ట్రీమింగ్‌ కానుంది. 

రెండో ఎపిసోడ్‌ ‘ది హిస్టరీ ఉయ్‌ ఫర్‌గాట్‌’ ఈ నెల 30న, మూడో ఎపిసోడ్‌ ‘ది మెన్‌ వుయ్‌ ఫర్‌గాట్‌’ అక్టోబరు 2న స్ట్రీమింగ్‌ కానున్నాయి. నాలుగో ఎపిసోడ్‌ ‘ది లాస్ట్‌ లోడ్‌’ స్ట్రీమింగ్‌ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్‌ పేర్కొన్నారు ‘‘రణబాలి’ ప్రపంచం నుంచి బిహైండ్‌ ది సీన్స్‌ కంటెంట్‌తో ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ రాబోతోంది. చరిత్రకు రెండు పార్శా్వలు ఉన్నాయి. ఒకటి మనకు చెప్పింది, మరొకటి ఎవరికీ తెలియకుండా సమాధి చేయబడింది. మనకు తెలియకుండా చరిత్రలో కనుమరుగు చేసిన ఆ నిజాలను చెప్పబోతోంది ఈ ట్రూత్‌ సిరీస్‌’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement