నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కథ, పాత్రలు, కొన్ని సన్నివేశాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో కుక్క దేవుడికి దండం పెట్టే సన్నివేశంతో పాటు హీరోను కాపాడే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలపై నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఈ సీన్లకు లాజిక్ ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ ట్రోలింగ్‌పై నానీతో జరిగిన పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలో స్పందించారు. సినిమాను సినిమాలాగే చూడాలని, ప్రతీ సన్నివేశంలో లాజిక్ వెతికితే ఎంజాయ్ చేయడం కష్టమని ఆయన అన్నారు. తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు.
‘రాజమౌళితో నన్ను నేను పోల్చుకోవట్లేదు. కానీ ‘మగధీర’ సినిమాలో ‘ధీర బాద్షా’ అన్నప్పుడు గుర్రం గాల్లోకి ఎగిరి కాలితో తాడును విసిరేస్తుంది. ఆ సీన్ చూసి థియేటర్లలో మనమంతా పిచ్చెక్కిపోయి విజిల్స్ వేశాం. అక్కడ లేని లాజిక్.. ‘ప్యారడైజ్’ సినిమాలో కుక్క ఎమోషన్‌ను చూపించినప్పుడు ఎందుకు గుర్తొస్తోంది?’ అని శ్రీకాంత్ ఓదెల పరోక్షంగా ప్రశ్నించారు. ప్రతీ సన్నివేశానికి అతిగా లాజిక్ వెతికితే ఏ సినిమాను కూడా పూర్తిగా ఆస్వాదించలేమని ఆయన వ్యాఖ్యానించారు. ట్రోలింగ్‌కు పరోక్షంగా శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Reason Behind “Diamond” Praying & Crying!!
Srikanth Odela Compares it with Rajamouli’s Magadheera Horse Scene.#TheParadise pic.twitter.com/G89ZltYl8X— cinee worldd (@Cinee_Worldd) September 27, 2026


