ముగ్గురు భామలతో వెంకీ డ్యాన్స్.. 'నారాయణమ్మ' సాంగ్ రిలీజ్ | Aadarsha Kutumbam Movie Narayanamma Song | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Song: 'ఆదర్శ కుటుంబం'లో పార్టీ సాంగ్ చూశారా?

Sep 27 2026 6:39 PM | Updated on Sep 27 2026 6:39 PM

Aadarsha Kutumbam Movie Narayanamma Song

వెంకటేశ్-‍త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా 'ఆదర్శ కుటుంబం'. లెక్క ప్రకారం వచ్చే శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ వారం ఆలస్యంగా అంటే అక్టోబరు 09న రాబోతుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు తొలి సాంగ్ వదిలారు.

'నారాయణమ్మ' అంటూ సాగే పాట రెగ్యులర్ పార్టీ స్టైల్ సాంగ్‌లానే ఉంది. తమన్ అందించిన సంగీతం ఓ మాదిరిగానే అనిపించింది. వెంకీ.. డింపుల్ హయాతి, నివేతా పేతురాజ్,‍శ్రీనిధి శెట్టిలతో డ్యాన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మరి ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించనుందో చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement