నాని హీరోగా వచ్చిన ది ప్యారడైజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్లు పరంగా దూసుకెళ్తోంది. తొలిరోజే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి నాని కెరీర్‌లోనే ది బెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.
ఆడియన్స్ టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ది ప్యారడైజ్ మూవీ కలెక్షన్లపరంగా రాణిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.155 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ చిత్రాన్ని సవారీ అనే జాతి మనుషులు గుర్తింపు కోసం చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కించారు. సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ ప్రాంతంలో ఉండే వారి జీవితాల ఆధారంగా రూపొందించారు. ఈ మూవీ ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో కేసీఆర్‌లా ప్రియదర్శి నటించడం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషించారు.
A blockbuster first weekend for #TheParadise ❤🔥❤🔥
Collects 155 CRORES+ GROSS WORLDWIDE in 4 days 💥💥
Book your tickets now!
🎟️ https://t.co/QWwS4Ichic pic.twitter.com/4mxStTXGVW— THE PARADISE (@TheParadiseOffl) September 28, 2026


