రూ.2 కోట్లు పెడితే రూ.400 కోట్లు వచ్చాయి..! | Hanuman Ansh Box Office Day 52 Worldwide Box Office Collections, Movie Crosses ₹400 Crore Worldwide, Continues Its Strong Run | Sakshi
Sakshi News home page

Hanuman Ansh: రూ.2 కోట్లు పెడితే రూ.400 కోట్ల లాభం..!

Sep 28 2026 12:35 PM | Updated on Sep 28 2026 12:57 PM

Hanuman Ansh box office Day 52 world wide Collections

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ మరో మైలురాయి చేరుకుంది. ఈ చిత్రం రిలీజైన 52 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాని నటించిన 'ది ప్యారడైజ్', సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటించిన 'ది వాన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' వంటి పెద్ద చిత్రాలు విడుదలైనా వసూళ్లను నమోదు చేసింది.

ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం ఇప్పటివరకు భారతదేశ రూ. 307.03 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 362.70 కోట్లకు పైగా సాధించింది. ఓవర్‌సీస్‌లో రూ. 38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా..  ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్త రూ. 401.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే 50 రోజులు దాటినా కూడా హనుమాన్ అన్ష్ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. కాగా.. ఈ సినిమాకు విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో చందన్ కె ఆనంద్, నిఖిల్ దుబే, అనిల్ రస్తోగి, సుగంధ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement