అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' తీస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. మరోవైపు నిర్మాతగానూ మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: శోభనం రాత్రి ఏం జరిగింది? ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)
అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు నిర్మాణంలోనూ సందీప్ రెడ్డి వంగాకు చెందిన భద్రకాళి పిక్చర్స్ భాగమైంది. వీళ్లు తెలుగులో చేసిన చిన్న సినిమా 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ కథతో తీసిన ఈ చిత్రం ఈ నెల 3న థియేటర్లలోకి వచ్చింది. ప్రమోషన్లతో హడావుడి చేశారు గానీ జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ మూవీ ఈ గురువారం(అక్టోబరు 01) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
'రోమాంచకం' విషయానికొస్తే.. అన్వేష్(సుమంత్ ప్రభాస్) కాలేజీ చదువు పూర్తి చేసిన కుర్రాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ స్టార్టప్ కంపెనీ పెట్టి ప్రయత్నాల్లో ఉంటాడు. రోమాంచకం అనే డేటింగ్ యాప్ తీసుకురావాలనేది ఇతడి ఆలోచన. అమ్మాయిలు, అబ్బాయిల అవసరాలు తీర్చేందుకే ఈ యాప్ అని చెబుతుంటాడు. ఈ యాప్ ద్వారానే చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్)తో ఇతడికి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
మైథిలి పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుని ఆమెని సర్‌ప్రైజ్ చేయాలని అన్వేష్.. చెన్నై వెళ్తాడు. ఓ హోటల్‌లో ఉన్నానని, అక్కడికి రావాలని కబురు పెడతాడు. వస్తానని చెప్పిన మైథిలి ఆ వెంటనే ఫోన్‌లో, సోషల్ మీడియా అకౌంట్లలో అన్వేష్‌ని బ్లాక్ చేసేస్తుంది. ఆమె హోటల్‌కు రాకపోవడానికి కారణమేంటి? ఆమె మాయం కావడం వెనక ఎవరున్నారు? మళ్లీ తిరిగొచ్చిందా లేదా? అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన)


