సూర్య పేరుకే తమిళ హీరో కానీ తెలుగు హీరోలకు మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ ఇతడి సినిమా వస్తుందంటే చాలు చాలామంది తెలుగు ఆడియెన్స్.. థియేటర్లకు వెళ్లి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకు తగ్గట్లే ఇప్పుడు సూర్య కూడా తెలుగు ప్రజలు ఖుషీ అయిపోయే కామెంట్స్ చేశాడు. ఆతిథ్యం విషయంలో తెలుగోళ్ల సూపర్ అని కితాబు ఇచ్చేశాడు.
'ఆతిథ్యం విషయంలో తమిళనాడుకు సాటిలేదని ఎప్పుడూ అనుకునేవాడిని. కానీ ఆంధ్రా-తెలంగాణలో తిరిగిన తర్వాత అక్కడి ప్రజలు.. ఆతిథ్యాన్ని ఎంత హృదయపూర్వకంగా పాటిస్తారో నాకు అర్థమైంది. వారు ఆహ్వానించే తీరు, శ్రద్ధ తీసుకునే విధానం, ప్రేమగా భోజనం పెట్టడం, మిమ్మల్ని మీ ఇంట్లో ఉన్నట్లుగా అనిపించేలా చేయడం.. నిజంగా భేష్. అది నిజంగా ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. వారి ఆతిథ్యంలో ఒక ప్రత్యేకమైన ఆప్యాయత ఉంది' అని సూర్య చెప్పుకొచ్చాడు.
రాజమౌళి సమర్పణలో ఇతడి కొడుకు కార్తికేయ నిర్మించిన తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. ఫహాద్ ఫాజిల్ హీరో. శశాంత్ యేలేటి దర్శకుడు. అక్టోబరు 02న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలో భాగంగానే తమిళనాడుకి వెళ్లారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సూర్య.. పై కామెంట్స్ చేశాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆతిథ్యం విషయంలోనే కాదు సూర్య సినిమాల విషయంలోనూ తమిళం కంటే తెలుగులోనూ ఎక్కువ ఆదరణ దక్కిన సందర్భాలు ఉన్నాయి. గతం సంగతేమో గానీ గత నెలలో ఇతడు హీరోగా చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా వచ్చింది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ తీసినప్పటికీ దీనిని తమిళ చిత్రంగానే ప్రమోట్ చేశారు. కానీ అక్కడ ఎవరూ పెద్దగా చూడలేదు. తెలుగులోనూ హిట్ టాక్‌తో పాటు కలెక్షన్స్ కూడా రావడం విశేషం.
#Suriya Says Tamilian’s Can’t Match Telugu People’s Unconditional Hospitality:
“There is a word called Virundhombal (Hospitality). I thought Tamil Nadu was the best in Hospitality, but I learned it only after going to Andhra/Telangana. Their hospitality can’t match ours, they… pic.twitter.com/LFBaqLxGn7— cinee worldd (@Cinee_Worldd) September 27, 2026


