breaking news
Romanchakam Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి గాంధీ జయంతితో పాటు వీకెండ్ కలిసొచ్చింది. కానీ చెప్పుకోదగ్గ మూవీస్ థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీతో పాటు దళపతి విజయ్ కొడుకు జేసన్ దర్శకుడిగా తొలిసారి చేసిన 'సిగ్మా', తెల్ల కాగితం, అనకాపల్లి, ప్రేమనే ఊరిలో తదితర మూవీస్ ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మరోవైపు ఓటీటీల్లోనూ 23 వరకు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మమిత బైజు చేసిన సెన్సేషనల్ హిట్ 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్', #లవ్ సిరీస్, పూజా మేరీ జాన్, రోమాంచకం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని వీకెండ్ టైంలో సడన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 04 వరకు)హాట్స్టార్మైన్ లడేగా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 30బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02మార్షల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04ట్రాకర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04నెట్ఫ్లిక్స్డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28ఇర్రెప్లేసబుల్ (చైనీస్ సిరీస్) - సెప్టెంబరు 28డిమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ కేజిల్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 28ఐ పాప్-స్టార్స్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 29లెగో వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29ద ఎరీనా (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 30మెదుశా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30రోమాంచకం (తెలుగు సినిమా) - అక్టోబరు 01ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 01ఓ మై డాగ్ (హిందీ సినిమా) - అక్టోబరు 01#లవ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 02డూయింగ్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02షూమాకర్ '94: ద బర్త్ ఆఫ్ ఏ లెజెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02అమెజాన్ ప్రైమ్దుపాహియా సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 01జీ5పంథడిక్కామ్ (మలయాళ సిరీస్) - అక్టోబరు 01పూజా మేరీ జాన్ (హిందీ సినిమా) - అక్టోబరు 02మదర్ ప్రామిస్ (కన్నడ చిత్రం) - అక్టోబరు 02ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02ఆపిల్ టీవీ ప్లస్ద లాస్ట్ ఫస్ట్: వింటర్ కె2 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 02(ఇదీ చదవండి: నా భార్య కనిపించట్లేదు.. ఓటీటీ కోసం కలిసిన హిట్ జోడీ) -
ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' తీస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. మరోవైపు నిర్మాతగానూ మూవీస్ చేస్తున్నాడు. అలా చేసిన ఓ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: శోభనం రాత్రి ఏం జరిగింది? ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు నిర్మాణంలోనూ సందీప్ రెడ్డి వంగాకు చెందిన భద్రకాళి పిక్చర్స్ భాగమైంది. వీళ్లు తెలుగులో చేసిన చిన్న సినిమా 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ కథతో తీసిన ఈ చిత్రం ఈ నెల 3న థియేటర్లలోకి వచ్చింది. ప్రమోషన్లతో హడావుడి చేశారు గానీ జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ మూవీ ఈ గురువారం(అక్టోబరు 01) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.'రోమాంచకం' విషయానికొస్తే.. అన్వేష్(సుమంత్ ప్రభాస్) కాలేజీ చదువు పూర్తి చేసిన కుర్రాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ స్టార్టప్ కంపెనీ పెట్టి ప్రయత్నాల్లో ఉంటాడు. రోమాంచకం అనే డేటింగ్ యాప్ తీసుకురావాలనేది ఇతడి ఆలోచన. అమ్మాయిలు, అబ్బాయిల అవసరాలు తీర్చేందుకే ఈ యాప్ అని చెబుతుంటాడు. ఈ యాప్ ద్వారానే చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్‌కుమార్)తో ఇతడికి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.మైథిలి పుట్టినరోజు ఎప్పుడో తెలుసుకుని ఆమెని సర్ప్రైజ్ చేయాలని అన్వేష్.. చెన్నై వెళ్తాడు. ఓ హోటల్లో ఉన్నానని, అక్కడికి రావాలని కబురు పెడతాడు. వస్తానని చెప్పిన మైథిలి ఆ వెంటనే ఫోన్లో, సోషల్ మీడియా అకౌంట్లలో అన్వేష్ని బ్లాక్ చేసేస్తుంది. ఆమె హోటల్‌కు రాకపోవడానికి కారణమేంటి? ఆమె మాయం కావడం వెనక ఎవరున్నారు? మళ్లీ తిరిగొచ్చిందా లేదా? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన) -
మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు: సుమంత్ ప్రభాస్
‘‘రోమాంచకం’ చేస్తున్నప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అంతే బాగా ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. మేము కోరుకున్నటే ఆడియన్స్ బాగా నవ్వుకుంటున్నారు. ఈ మూవీ వల్ల హీరో ప్రభాస్ అన్నని కలవడం సంతోషం. ఈ సినిమా నాకు అన్ని రకాలుగా చాలా ప్రత్యేకం. ఇంకా మా చిత్రం చూడని వారు థియేటర్లకు వెళ్లండి.. మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు’’ అని హీరో సుమంత్ ప్రభాస్ తెలి పారు. వేణుగో పాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల అయింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్ బస్టర్ ఈవెంట్లో డైరెక్టర్ వేణుగో పాల్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సందీప్, ప్రణయ్గార్లు ‘రోమాంచకం’కి అవకాశంతో పాటు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కుటుంబ ప్రేక్షకులంతా మా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ–‘‘రోమాంచకం’ సినిమా థియేటర్స్‌లో బాగా రన్ అవుతోంది. ఎక్కడా నవ్వులు తగ్గలేదు. మా మూవీకి 8.5 కోట్ల రూ పాయల కలెక్ష న్స్ వచ్చాయి’’ అని పేర్కొన్నారు. ‘‘థియేటర్స్‌కు వచ్చి ‘రోమాంచకం’ మూవీ చూడండి. మీకొక డిఫరెంట్ ఎక్స్‌పీరియ న్స్ ఇస్తుంది’’ అన్నారు డైరెక్టర్, యాక్టర్ అనుదీప్ కేవీ. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ రజిత, డైలాగ్ రైటర్ మీరక్, నటులు సోహాన్, నరేంద్ర రవి, వెంకటేష్ కాకుమాను మాట్లాడారు. -
‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
Romanchakam: రోమాంచకం మూవీ రివ్యూ
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించారు. ఈ మూవీని వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. సెప్టెంబర్ 3న ఈ మూవీని విడుదల చేశారు. మరి ఈ సినిమాకి సంబంధించిన కథ ఎలా ఉంది? రివ్యూ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే?అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే ఓ కుర్రాడు బాధ్యత లేకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. అప్పులు చేసి స్టార్టప్ అని డబ్బులన్నీ వృథా చేస్తాడు. ‘రోమాంచకం’ అని అమ్మాయిల్ని, అబ్బాయిల్ని కలిపే ఓ డేటింగ్ యాప్ క్రియేట్ చేయాలని చూస్తుంటాడు. అయితే టెస్టింగ్ క్రమంలో ఈ యాప్ ద్వారానే చెన్నైలో ఉండే మైథిలి (అనంతిక)తో పరిచయం పెంచుకుంటాడు. ఆమె కూడా అన్వేష్ ప్రేమలో పడిపోతుంది. మైథిలీ బర్త్ డే సందర్భంగా అన్వేష్ చెన్నైకి వెళ్లి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. అలా అన్వేష్ చెన్నైకి కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అన్వేష్ ఫోన్ పోగొట్టుకుంటాడు. ఎలాగోలా మైథిలీకి ఫోన్ చేసి హోటల్‌కి రమ్మంటాడు. వస్తాను అని మైథిలీ చెబుతుంది. కానీ ఆ తర్వాత క్షణం నుంచి మైథిలీ ఫోన్ కలవదు. అన్వేష్ నంబర్ని అన్ని చోట్లా బ్లాక్ చేస్తుంది. మళ్లీ మూడు నెలల తర్వాత లైన్లోకి వస్తుంది. అసలు మైథిలీ ఎందుకు బ్లాక్ చేస్తుంది? మళ్లీ ఎందుకు లైన్లోకి వస్తుంది? అన్వేష్ కోసం ఆమె హైదరాబాద్‌కి ఎందుకు వస్తుంది? వచ్చాక ఏం జరుగుతుంది? ఆమె రాకతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు? అన్నది మిగతా కథ. ఎలా ఉందంటేజెన్ జీ మైండ్ సెట్‌ను బేస్ చేసుకుని కథను అల్లుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కథలో చాలా వరకు లాజిక్స్, ఎమోషన్స్ ఇలా ఏవీ కనిపించవు. ఇప్పుడు ఉన్న తరం కూడా ఇలానే ఆలోచిస్తుంటుంది. ఎందుకు అలా చేస్తున్నారు.. ఇలా ప్రవర్తిస్తుంటారు? అన్నది చెప్పడం కష్టం. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల పాత్రల్ని చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. చాలా వరకు సిల్లీగా అనిపిస్తుంది. మరీ ఇలా ఉన్నారేంట్రా.. అని అనిపించొచ్చు. కథలో ఎక్కడా కూడా ఎమోషన్ అన్నది కనిపించదు. లాజిక్ అయితే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగుతుంది. హీరో, అతని గ్యాంగ్ చేసే కామెడీ బాగుంటుంది. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కాస్త ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. పాటలు, కామెడీ సీన్లతో ఫస్ట్ హాఫ్ అంతా అలా ఫ్లోలో సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్‌లో అయినా కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుందని అనుకుంటే.. పొరబాటే. అసలు సినిమాలో ఎక్కడా కూడా సీరియస్ నెస్ కనిపించదు. చాలా వరకు ఎమోషన్ మిస్ అవ్వడం మైనస్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ కూడా ఫుల్ కామెడీగానే సాగుతుంది. లాజిక్స్, కథ గురించి ఆలోచించకుండా సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ఈ సినిమా కొంత వరకు ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా నటించారంటే?సుమంత్ ప్రభాస్ యాక్టింగ్, కనిపించే తీరు అంతా కూడా పక్కింటి అబ్బాయిలా ఉంటుంది. అనంతిక మాత్రం తెరపై అందంగా కనిపిస్తుంది. ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువే. అయినా కనిపించినంత వరకు ఆకట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ మాత్రం తమ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్విస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా నవ్విస్తుంది. మిగిలిన కారెక్టర్స్ అందరూ కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. సాంకేతికంగా ఎలా ఉందంటే..విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గానే కనిపిస్తుంది. పాటలు బాగుంటాయి. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఎడిటింగ్ బాగుంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. కథకు కావాల్సినంత ఖర్చు పెట్టినట్టుగా కనినిపిస్తుంది. జెన్ జీ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసిన ఈ మూవీ కమర్షియల్‌గా ఏ రేంజ్ సక్సెస్‌ని సాధిస్తుందో చూడాలి. -
ప్రభాస్‌ని కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు గోపాల్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రేపు(సెప్టెంబర్ 3) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ ప్రభాస్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు.→ తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది.→ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్తై కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది.→ రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా.. డైరెక్టర్ వేణుగోపాల్ ఆయనకు ఈ క్యారెక్టర్ కు ఎలా ఉండాలో అలా మార్చుకునేందుకు ఆర్నెళ్లు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ లో ఎలా నటించాలి అనేది నాకు ఐడియా ఉంది. కానీ వర్క్ షాప్స్ తో షార్ప్ అయ్యాను. వర్క్ షాప్స్ అంతా కంప్లీట్ అయ్యాక మొదటి నుంచి చివరి దాకా నా పర్ ఫార్మ్ చూసుకుంటే ఎంతో మార్పు కనిపించింది. కొన్నిసార్లు ఒకే సీన్ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి.→ సందీప్ అన్న ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలిసి ఒక క్యూట్ స్టోరీ ఉంది నువ్వు విను అన్నారు. ఆయన చెప్పాడంటే తప్పకుండా బాగుంటుందని కథ విన్నాను. వేణు అన్న చెప్పిన నెరేషన్ రెండున్నర గంటలు ఎంజాయ్ చేశాను.సందీప్ అన్న, ప్రణయ్ అన్న బయటకు అలా కనిపిస్తారు కానీ వాళ్లు చాలా స్వీట్ పర్సన్స్. వాళ్లతో ట్రావెల్ అయిన వాళ్లకు తెలుస్తుంది.→ విజయ్ దేవరకొండ అన్న మా మూవీ ప్రీ రిలీజ్ కు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా గురించి బాగా మాట్లాడటం కూడా సంతోషాన్నిచ్చింది. విజయ్ అన్నను చూసి నేను చాలా ఇన్స్ పైర్ అవుతుంటాను. రోమాంచకం సినిమా ఫస్ట్ కాపీ చూసి సందీప్ అన్న బాగా పర్ ఫార్మ్ చేశావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. రోమాంచకం టైటిల్ కొత్తగా ఉంది ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా అనిపించింది. కానీ ఇప్పుడు అదొక ఊతపదంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ పదం వాడుకలోకి వస్తుందని నమ్ముతున్నా.→ అనంతిక టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమెకు చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసు. ఏ విద్యనైనా తక్కువ టైమ్ లో నేర్చుకుంటుంది. ఆమెతో ఈ మూవీలో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది. మా సినిమా ఆద్యంతం రోమాంచకం ఫీల్ ను ప్రేక్షకులకు కలిగిస్తుంటుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ చూస్తారు. ప్రతి సీన్ మీకు నవ్వు తెప్పిస్తుంది. నాకు సినిమా చూసినంత సేపు మజా వచ్చింది. మా మూవీలో వాసుకి వైభవ్ మ్యూజిక్ ఇరగదీశాడు. రాధారమణ నా ఫేవరేట్ సాంగ్. ఇంకో లవ్ సాంగ్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు.→ హీరోగా అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ వస్తున్నాయి. హీరోగా పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. నెక్ట్స్ ఏషియన్ బ్యానర్ లో రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటితో ఒక మూవీ చేయబోతున్నా. ఈ నెలలోనే ఆ మూవీ స్టార్ట్ కానుంది. -
కొత్త సీన్లతో ‘అర్జున్ రెడ్డి’ మళ్లీ రిలీజ్ చేస్తాం: ప్రణయ్ రెడ్డి
‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? వాళ్ల ఫ్రెండ్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి? అనేది ‘రోమాంచకం’ సినిమాలో మంచి వినోదాత్మకంగా సాగుతుంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. 2 గంటల 20 నిమిషాల టైమ్‌లో ఎక్కడా బోర్ కొట్టదు’’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా విలేకరులతో చెప్పిన విశేషాలు. (చదవండి: మూడు వారాల్లోపే ఓటీటీలో కొత్త మూవీ స్ట్రీమింగ్)→ సినిమా నిర్మాణం సీరియస్‌గా చేయాలని టీమ్స్‌ను పెట్టుకుని చేసే మైండ్ సెట్లో మేం లేం. డైరెక్టర్ వేణుగోపాల్ మూడు నాలుగేళ్లుగా మాతో జర్నీ చేస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ నెరేషన్ మమ్మల్ని ఆకట్టుకోవడంతో ‘రోమాంచకం’ తీశాం. → ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాక సందీప్ రెడ్డి జోక్యం చేసుకోలేదు. ఆయన ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మా మూవీ ఔట్పుట్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. సుమంత్, అనంతిక బాగా నటించారు. వాసుకి వైభవ్ అద్భుతమైన సంగీతం అందించారు. యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి ఇబ్బంది లేకుండా మా మూవీ చూడొచ్చు. → అమెరికాలో సెన్సార్ అనేది ఇండస్ట్రీ వాళ్ల సారథ్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వ కోణంలో సెన్సార్ నిబంధనలు సరైనవే. ఆ రూల్స్ తెలిసుంటే ఫిల్మ్ మేకర్స్ ముందే జాగ్రత్తపడతారు. → ‘అర్జున్ రెడ్డి’ని మళ్లీ రిలీజ్ చేస్తాం... ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి, వచ్చే ఏడాది రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌గారితో మేం చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయింది. ‘స్పిరిట్’ మూవీ పూర్తయ్యాక సందీప్, నేను కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాం. మంచి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా చిన్న చిత్రాలు నిర్మిస్తాం. -
భావోద్వేగాలు బలంగా ఉంటాయి: అనంతిక సనిల్‌కుమార్
‘‘రోమాంచకం’ చిత్రంలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ... ఈ మూడు భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ఈ మూడింటిలో నాకు ఉత్కంఠ బాగా నచ్చింది. ఈ ఉత్కంఠ కూడా ప్రేమవల్లే అవుతుంది. అది ఎలా జరిగింది? అనేది సినిమాలోనే చూడాలి. నేను గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ‘రోమాంచకం’లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంత సరదాగా, సంతోషంగా చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అనంతిక సనిల్‌కుమార్ మాట్లాడుతూ–‘‘8 వసంతాలు’ సినిమా తర్వాత చాలా కథలు విన్నప్పటికీ ఎగై్జటింగ్‌గా అనిపించలేదు. ‘రోమాంచకం’ కథ విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో బబ్లీ గర్ల్, సరదాగా ఉండే తమిళ అమ్మాయిగా కనిపిస్తా. ఇది ప్రేమ కథా చిత్రమే అయినప్పటికీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సుమంత్ ప్రభాస్ పాత్ర ఈ మూవీలో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా ఆయనతో పోటీ పడేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ వేణుగోపాల్‌గారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డిగార్లు నా పాత్ర చాలా బాగా వచ్చిందని అభినందించడం సంతోషం. అయితే ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను. యాక్షన్, డ్యాన్స్ బేస్డ్ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధమే. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. -
రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
-
‘నాతో సినిమా చేయడానికి పొలం అమ్మేశారు’
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రామానాయడు స్డూడియోస్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.ఎక్కువమంది చదివింది: చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?‘అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి సందీప్ నన్ను చాలా నమ్మాడు. నాతో ఆ సినిమా చేయడానికి సందీప్, ప్రణయ్‌లు తమ పొలాన్ని అమ్మాల్సి వచ్చింది. సినిమాపై, నాపై నమ్మకంతో అంతవరకు వెళ్లారు. ఇప్పుడు ఈ సినిమాకి గెస్ట్‌గా వచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. సందీప్ పిలిచినప్పుడు రాకపోతే నేను బ్రతికి వేస్ట్. మన ఇద్దరి మధ్య ఉన్న బాండీంగ్లో థ్యాంక్స్ లాంటావి ఉండకూడదు. సందీప్ నాకు బ్రదర్ కాదు, స్నేహితుడు అంతకంటే కాదు. మా బాండింగ్ వేరే.’ అంటూ విజయ్ మాట్లాడుతూ భావోద్వేగం అయ్యాడు.‘రణబాలి’ విషయానికి వస్తే..హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా? -
రష్మిక కు బాగానే ఉంది ఇంట్లో ఎంజాయ్ చేస్తుంది
-
‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
మనలో ఫైర్ ఉంటే ప్రపంచంలో ఏదీ ఆపలేదు: విజయ్ దేవరకొండ
‘‘మన హార్ట్‌లో ఫైర్ ఉండి, యాంబిషన్ ఉండి, నీకు నీపై నమ్మకం ఉంటే ఎప్పుడైనా సక్సెస్ కొట్టొచ్చు. బాయ్స్... మీ అందరికీ చెబుతున్నాను. వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ, నీపై నువ్వు నమ్మకం ఉంచి, మనలోని ఫైర్‌ను అలానే కొనసాగించగలిగితే ప్రపంచంలో ఏదీ మనల్ని ఆపలేదు’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన సినిమా ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణుగోపాల్‌రెడ్డి దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ ఈ సినిమాలోని పాటను రిలీజ్ చేశారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘అప్పట్లో ఒకవేళ ఆ సినిమా (‘అర్జున్ రెడ్డి’) ఆడకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితి మాది. చేతుల్లో డబ్బులు లేవు, ఇన్ఫ్లూయెన్స్, కనెక్షన్స్ లేవు. వెనక మీరందరూ (ఫ్యాన్స్) కూడా లేరు. అప్పటికి ‘పెళ్ళి చూపులు’ సినిమా రిలీజ్ కాలేదు. సందీప్, ప్రణయ్ అన్న, ప్రభాకర్ అంకుల్ వాళ్ల పోలం అమ్మి ‘అర్జున్ రెడ్డి’ తీశారు. నా గురించి సందీప్ ఎంత దూరం అయిన వెళ్లేటోడు. నేను సందీప్ గురించి ఎంత దూరమైనా వెళ్తా. ‘నువ్వు పిలిచినప్పుడు రాకపోతే బతికి వేస్టు..’. ఇక మా రౌడీవేర్ ఆఫీస్ దగ్గర సుమంత్ అప్పుడప్పుడు కనిపించేవాడు. వీడు లైఫ్‌లో యాక్టరో, డైరెక్టరో అవుతాడనుకున్నాను. సందీప్, ప్రణయ్ అన్న ఒక సినిమా చేస్తున్నారంటే... అది కచ్చితంగా విజయం సాధించాలి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నాకు ఇంకా గుర్తుంది. ‘అర్జున్ రెడ్డి’ ఆడియో ఫంక్షన్లో నేను దిగినప్పుడు మీ అరుపులు విని, ఇక్కడ్నుంచి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యాను. ఈ ఇండస్ట్రీ నుంచి కదిలేదే లేదు... ఫిక్స్’’ అని చె΄్పారు. రష్మిక మందన్నా గురించి అభిమానులు అడిగితే... ‘‘వదినమ్మా... బాగానే ఉంది. గాయమైంది. రికవరీ అవుతోంది. ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది.‘రణబాలి’ సినిమా గురించి త్వరలోనే మాట్లాడదాం’’ అన్నారు విజయ్ దేవరకొండ. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘రోమాంచకం’ కథ విన్నప్పుడు చెప్పినట్లు తీస్తావా? అని డైరెక్టర్‌ను అడిగితే ఓ ఆరు నిమిషాల సీన్ తీసి చూపించాడు. చెప్పినదానికన్నా బాగా తీశాడనిపించింది. సెప్టెంబరు 2న ప్రీమియర్స్ వేస్తున్నాం. వేణు కల నిజం కాబోతోంది. వేణు జీవితంలో సెప్టెంబరు 2, 3 మార్నింగ్ స్పెషల్‌గా ఉండబోతున్నాయి. విజయ్‌కు, నాకు ఇంకా గుర్తుంది.. ఆ ఆగస్టు 24 నైట్ (‘అర్జున్ రెడ్డి’ని ఉద్దేశించి). అలాంటి మూమెంట్ నీకు క్రియేట్ కావాలి. ‘రోమాంచకం’ కోసం మా నాన్న, అన్నయ్య, టీమ్ హార్డ్ వర్క్ చేశారు. ప్రేక్షకులు కేటాయించే డబ్బు, సమయం వృథా కావు’’ అని అన్నారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్స్‌కు వెళ్లి ఈ సినిమాని చూడండి’’ అన్నారు ప్రణయ్ రెడ్డి వంగా. ‘‘ఈ సినిమా నా కెరీర్‌కి పెద్ద మైల్స్టోన్ అవ్వాలన్నది నా ఆకాంక్ష’’ అని అన్నారు సుమంత్ ప్రభాస్. ‘‘కాలేజీ స్టడీస్ పూరయ్యాక రియాలిటీ తెలుస్తుంది. కొంత కన్ఫ్యూజ్ అవుతాం. నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతుంటాం. ఆ అంశాలను ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు వేణుగోపాల్. -
రోమాంచకం చూస్తున్నప్పుడు నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా
‘‘రోమాంచకం’ కథ విన్నాను, ఫస్ట్ కట్ చూశాను. సినిమా కూడా చూశాను.. చాలా బాగుంది. ఈ కథ విన్నప్పుడు నేను ఎంతగా నవ్వుకున్నానో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. ఇది సూపర్ హిలేరియస్ మూవీ’’ అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘మా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రాలన్నిటికీ ‘ఎ’ సర్టిఫికెట్స్ వచ్చేవి. రాబోయో ‘స్పిరిట్’ మూవీకి కూడా ‘ఎ’ సర్టిఫికెట్ వస్తుంది. అయితే తొలిసారి మా బ్యానర్లో రూపొందిన ‘రోమాంచకం’ మూవీకి క్లీన్ ‘యు/ఏ’ సెన్సార్ సర్టిఫికెట్ వస్తోంది. ఈ సినిమాకు కుటుంబంతో పాటు రండి’’ అని కోరారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఇలా ఎవరితో చూసినా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అంతేకానీ నిరుత్సాహపడరు’’ అని చెప్పారు. ‘‘మా సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏంటో తెలియాలంటే మా మూవీ చూసేందుకు థియేటర్స్‌కు రండి’’ అని అనంతిక సనిల్ కుమార్ పేర్కొన్నారు. ‘‘మా మూవీకి వర్క్ చేసిన యంగ్ టీమ్ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ప్రణయ్ రెడ్డి వంగా. ఈ వేడుకలో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, కెమెరామేన్ పవన్ పప్పుల, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన, నటుడు వెంకటేష్ కాకుమాను మాట్లాడారు. -
'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నేను ఇలాంటి కథ రాయలేను.. 'స్పిరిట్'కి పక్కా 'ఏ' సర్టిఫికెట్
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే బ్లడీ వయలెన్స్, హై ఎమోషన్ ఉన్న అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలే గుర్తొస్తాయి. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' చేస్తున్న ఇతడు.. నిర్మాతగానూ ఓ చిత్రాన్ని తీశాడు. అదే 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించారు. సెప్టెంబరు 3న అంటే వచ్చే శుక్రవారం థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సందీప్ చెప్పిన మాటలు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి.(ఇదీ చదవండి: ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు: శోభిత)నేను రోమాంచకం కథని 'యానిమల్' చేస్తున్న టైమ్‌లో విన్నాను. మస్తు నవ్వుకున్నా.. ఈ స్టోరీలో నిజాయితీ ఉంది. నేను ఇలాంటి కథని రాయలేను. అందుకే నిర్మించాను. ట్రైలర్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎన్నిసార్లు ఫ్యామిలీతో రమ్మన్నా నా సినిమాలకు రాలేదు ఈసారి రండి. థియేటర్ బయట మిమ్మల్ని ఎవడూ ఆపడు. ఎప్పుడూ 'ఏ' వచ్చేది… ఫస్ట్ టైమ్ మేం తీసిన సినిమాకు క్లీన్ 'యూ/ఏ' వచ్చింది అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. అలానే 'స్పిరిట్'కి మాత్రం కచ్చితంగా ఏ సర్టిఫికెట్ వస్తుందని స్పష్టం చేశాడు.'రోమాంచకం' ట్రైలర్ బట్టి చూస్తే ఇదో జెన్-జీ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. హీరో ఓ స్టార్టప్ కంపెనీ నడుపుతుంటాడు. ఆ ప్రయాణంలో హీరోయిన్ పరిచయమవుతుంది. వాళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత అలకలు, అడ్డుగోడలూ మొదలవుతాయి. మరి ఈ ప్రేమకథ కంచికి ఎలా చేరిందనేదే మిగతా స్టోరీ. ప్రస్తుత యువత సైకాలజీని అర్థం చేసుకొని, వాళ్లకు నచ్చేలా ఓ ప్రేమకథ తీసినట్లు అనిపిస్తుంది. వేణు దర్శకుడు.(ఇదీ చదవండి: యష్ 'టాక్సిక్' ట్విటర్ రివ్యూ) -
కలలే... కథలే పెంచే..!
‘‘రాధా రమణ రాగాలు మనసున మోగే వేళలో... ఏదో తపన తాగేసి వయసులు ఊగే వేళలో... ఓ కన్నా నీ అందమే అలలై అలలై ముంచే..’ అంటూ సాగుతుంది ‘రాధా రమణ’ పాట. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ సినిమాలోనిది ఈ పాట. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 3న రిలీజ్ కానుంది.ఈ సినిమా నుంచి ‘రాధా రమణ’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘కన్నుల్లో అందుకే కలలే... కథలే పెంచే, ఆవేశమే తెరచాటుగా లాగగా, బిడియాల ఆదేశమే పొరపాటనీ ఆపగా, ఈ ఊగిసలో, ఉందనా లేదనా...’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా, ఈ చిత్రసంగీత దర్శకుడు వాసుకి వైభవ్ పాడారు. ‘‘ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. -
సందీప్ రెడ్డి ‘రోమాంచకం’ గ్లింప్స్ చూశారా?
భద్రకాళీ పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఈ కాంబోలో ఒక యంగ్ టీమ్ తో ఫ్రెష్ లవ్ స్టోరీ మూవీ వస్తోందంటే ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తారు, స్ట్రాంగ్ కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ప్రేక్షకులు కోరుకునే అలాంటి కొత్తదనంతో యూనిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది ‘రోమాంచకం’ సినిమా. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘రోమాంచకం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఈ రోజు ‘రోమాంచకం’ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ డీవోపీ పవన్ పప్పుల అందించిన పెయింటింగ్ లాంటి బ్యూటిఫుల్ విజువల్స్ తో , వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలొడియస్ ట్యూన్ తో సాగుతూ హీరోయిన్స్ మధ్య ఉన్న ప్రేమను, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. 'అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే — రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే — రోమాంచకం..' అంటూ గ్లింప్స్ లో వచ్చిన లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్ గా ఉండబోతుందో తెలియజేస్తోంది.


