‘నాతో సినిమా చేయడానికి పొలం అమ్మేశారు’ | Vijay Devarakonda Speech At Romanchakam Pre Release Event | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda Latest Speech: ‘సందీప్‌ పిలిచినప్పుడు రాకపోతే బ్రతికి వేస్ట్‌’

Aug 31 2026 1:05 PM | Updated on Aug 31 2026 1:09 PM

Vijay Devarakonda Speech At Romanchakam Pre Release Event

వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనీల్‌కుమార్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని రామానాయడు స్డూడియోస్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అవుతోంది.

ఎక్కువమంది చదివింది: చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్‌లో తోపులు.. ఎవరికి ఎంతంటే?

‘అర్జున్‌ రెడ్డి సినిమా చేయడానికి సందీప్‌ నన్ను చాలా నమ్మాడు. నాతో ఆ సినిమా చేయడానికి సందీప్‌, ప్రణయ్‌లు తమ పొలాన్ని అమ్మాల్సి వచ్చింది. సినిమాపై, నాపై నమ్మకంతో అంతవరకు వెళ్లారు. ఇప్పుడు ఈ సినిమాకి గెస్ట్‌గా వచ్చినందుకు ఆయన థ్యాంక్స్‌ చెప్తున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. సందీప్‌ పిలిచినప్పుడు రాకపోతే నేను బ్రతికి వేస్ట్‌. మన ఇద్దరి మధ్య ఉన్న బాండీంగ్‌లో థ్యాంక్స్‌ లాంటావి ఉండకూడదు. సందీప్‌ నాకు బ్రదర్‌ కాదు, స్నేహితుడు అంతకంటే కాదు. మా బాండింగ్‌ వేరే.’ అంటూ విజయ్‌ మాట్లాడుతూ భావోద్వేగం అయ్యాడు.

‘రణబాలి’ విషయానికి వస్తే..
హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్‌ 16 ఈ సినిమా విడుదల కానుంది. 
బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్‌ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్‌, అతుల్‌ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 

 చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement