వేణుగో పాల్ రెడ్డి, ప్రణయ్ రెడ్డి, సుమంత్ ప్రభాస్, అనుదీప్
‘‘రోమాంచకం’ చేస్తున్నప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అంతే బాగా ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. మేము కోరుకున్నటే ఆడియన్స్ బాగా నవ్వుకుంటున్నారు. ఈ మూవీ వల్ల హీరో ప్రభాస్ అన్నని కలవడం సంతోషం. ఈ సినిమా నాకు అన్ని రకాలుగా చాలా ప్రత్యేకం. ఇంకా మా చిత్రం చూడని వారు థియేటర్లకు వెళ్లండి.. మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు’’ అని హీరో సుమంత్ ప్రభాస్ తెలి పారు. వేణుగో పాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల అయింది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్ బస్టర్ ఈవెంట్‌లో డైరెక్టర్ వేణుగో పాల్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘సందీప్, ప్రణయ్‌గార్లు ‘రోమాంచకం’కి అవకాశంతో పాటు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కుటుంబ ప్రేక్షకులంతా మా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పారు.
ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ–‘‘రోమాంచకం’ సినిమా థియేటర్స్‌లో బాగా రన్ అవుతోంది. ఎక్కడా నవ్వులు తగ్గలేదు. మా మూవీకి 8.5 కోట్ల రూ పాయల కలెక్ష న్స్ వచ్చాయి’’ అని పేర్కొన్నారు. ‘‘థియేటర్స్‌కు వచ్చి ‘రోమాంచకం’ మూవీ చూడండి. మీకొక డిఫరెంట్ ఎక్స్‌పీరియ న్స్ ఇస్తుంది’’ అన్నారు డైరెక్టర్, యాక్టర్ అనుదీప్ కేవీ. ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ రజిత, డైలాగ్ రైటర్ మీరక్, నటులు సోహాన్, నరేంద్ర రవి, వెంకటేష్ కాకుమాను మాట్లాడారు.


