వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జనవరి 12 విడుదల’. కీర్తీ సురేష్, కృతీ శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అర్చన, జీ స్టూడియోస్, సురేష్ ప్రోడక్షన్స్ సమర్పణలో సాహు గార పాటి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ మైసూర్‌లో జరుగుతోందని తెలిసింది. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌లతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి.


