'పండు ఐ లవ్ యూ రా.. నేను వెళ్లిపోతున్నా' | Madhuri Rathod Letter Goes Viral on Social Media | Sakshi
Sakshi News home page

Madhuri Rathod: 'నాకు బతకాలని లేదు.. పిల్లలందరికీ సారీ'

Sep 6 2026 3:22 PM | Updated on Sep 6 2026 3:50 PM

Madhuri Rathod Letter Goes Viral on Social Media

ఫోక్ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈశ్వర్ సాయి మోసం చేశాడని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఫోక్ డ్యాన్సర్‌ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అందరికీ సారీ.. నాకు ఇక బతకాలని లేదంటూ తన లేఖలో పేర్కొంది. పండు ఐ లవ్ యూ రా.. పిల్లలందరికీ సారీ రా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. నేను తప్పు చేశానని.. నా చావుకు నేనే కారణమంటూ అంటూ రాసుకొచ్చింది. నేను తప్పు చేశా.. అందుకే చనిపోవాలనుకుంటున్నానని మాధురి రాథోడ్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. 

కాపాడిన కుటుంబ సభ్యులు.. 

ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్‌ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్‌ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement