తమిళనాడు: తిరువొత్తియూర్ టి.ఎస్.ఆర్ నగర్‌కు చెందిన కందస్వామి కుమారుడు నవీన్ (35). ఇతను ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. తన మొదటి భార్యకు దూరంగా ఉంటున్నాడు. అదేవిధంగా తన భర్తను వదిలేసిన భవాని అనే మహిళను నెల రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత మరుసటి రోజు మరువలి పుట్టింటికి వెళ్లిన భవాని.. అక్కడే తన తల్లి ఇంట్లోనే ఉండిపోయింది.
ఒంటరిగా ఇంట్లో ఉంటున్న నవీన్, రెండో పెళ్లి చేసుకున్నాకూడా సంతోషంగా జీవించలేకపోతున్నానే అని తన తండ్రితో చెప్పి బాధపడినట్లు తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై న నవీన్, శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరువొత్తియూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: సినిమాకు తీసుకెళ్లి భార్య గొంతు కోసిన భర్త


