గాంధీనగర్ : గుజరాత్ భావ్‌నగర్ ఎస్టీ బస్టాండ్‌లో జరిగిన హత్య కేసుకు సంబంధించి, పోలీసులు నిందితుడితో కలిసి క్రైమ్ సీన్‌ను రీకన్‌స్ట్రక్ట్ చేశారు. అయితే, ఈ సందర్భంగా చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
పోలీసుల వివరాల మేరకు.. భావ్‌నగర్ ఎస్టీ బస్ స్టాండ్ ప్రాంతంలో ఫైసల్ (అలియాస్ ఖాట్కి లఖాని), కాజల్‌బెన్ గత ఏడేళ్లుగా కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. వివాహేతర సంబంధంందనే అనుమానంతో తలెత్తిన గొడవ కారణంగా ఫైసల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బస్ స్టాండ్‌లోనే కాజల్‌బెన్‌ను కిందపడేసి, తలపై, శరీరంపై తీవ్రంగా కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీన్ని అడ్డుకోబోయిన రవి అనే వ్యక్తిపై కూడా ఫైసల్ దాడి చేసి గాయపరిచాడు.
ఈ భయానక దాడి బస్ స్టాండ్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. చుట్టూ జనం చూస్తున్నప్పటికీ దాదాపు నిమిషాల తరబడి ఈ దాడి కొనసాగడం గమనార్హం. తీవ్ర గాయాలపాలైన కాజల్‌బెన్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సెప్టెంబర్ 4న ఆమె మృతి చెందింది.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైసల్‌పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుడికి ఇదివరకే దోపిడీలు, శారీరక దాడులకు సంబంధించిన క్రిమినల్ రికార్డు కూడా ఉంది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు ఫైసల్‌ను నేరుగా భావ్‌నగర్ ఎస్టీ బస్ స్టాండ్‌లోని ఘటనా స్థలానికి తీసుకువచ్చారు. అతను ఏ విధంగా మహిళపై దాడికి పాల్పడ్డాడో పోలీసులు అక్కడే పూసగుచ్చినట్లు రికన్‌స్ట్రక్ట్ చేసి పరిశీలించారు.
ఈ క్రమంలో బస్ స్టాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడిని పోలీసులు చుట్టుముట్టి అక్కడికి తీసుకెళ్లగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సంఘటన స్థలంలో నిందితుడిని పోలీసులు దండించిన తీరు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వైద్యం, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు
#BREAKING Bhavnagar Crime Incident
Faisal Khan was arrested by Gujarat Police after allegedly beating his live-in partner, Kajal Baraiya, to death in Bhavnagar. The assault, captured on CCTV, also injured her brother.#Bhavnagar #GujaratPolice @GujaratPolice @SPBhavnagar pic.twitter.com/VRyTmxTnZr— jarvis ☠️ (@Vishii14) September 5, 2026


