నడిరోడ్డుపై భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్‌ రేప్‌? | Bengaluru Woman Incident | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్‌ రేప్‌?

Sep 6 2026 11:31 AM | Updated on Sep 6 2026 11:37 AM

Bengaluru Woman Incident

బనశంకరి: బెంగళూరులో నడిరోడ్డున శనివారం తెల్లవారుజామున దంపతులను అడ్డగించి దోచుకున్న దుండగులు.. అంతటితో ఆగకుండా భర్త ఎదురుగా భార్యపై సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన పులకేశినగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు..  ఓ దంపతులు స్నేహితుని ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆటోలో తిరి వెళ్తున్నారు. 

భారతీనగర వద్ద ఐటీసీ ఫ్లై ఓవర్‌ పైన వెళుతుండగా బైకులలో వచ్చిన  ఐదారుమంది అల్లరి మూకలు కత్తులతో ఆటోడ్రైవరు, దంపతులను బెదిరించి మొబైల్, బంగారు గొలుసు, పర్సు లాక్కున్నారు. మహిళను ఆటోలో నుంచి కిందికి లాగి భర్త ఎదురుగా ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అల్లరిమూకలు ఉడాయించారు. భార్యాభర్తలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా దుండగుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

చదవండి: రన్నింగ్‌ ఆటోలోనే ప్రసవం.. రోడ్డుపై విసిరేసిన తల్లి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement