ఫోక్ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..! | Madhuri Rathod attempt for Self assassination famiy members Saved Her | Sakshi
Sakshi News home page

Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..!

Sep 6 2026 2:23 PM | Updated on Sep 6 2026 2:50 PM

Madhuri Rathod attempt for Self assassination famiy members Saved Her

ఈశ్వర్ సాయి- మాధురి రాథోడ్ ఎపిపోడ్‌ మరింత ముదిరింది. ఈ వివాదంలో మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు మాధురిని కాపాడారు. ఈశ్వర్‌ సాయిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్న మాధురిని కుటుంబ సభ్యులు కాపాడారు. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతోనే మాధురి రాథోడ్ సూసైడ్‌ చేసుకునేందుకు యత్నించింది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయకుండా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆరోపిస్తోంది. 

మాధురి రాథోడ్ ఫిర్యాదు..

అంతకుముందు ఫోక్‌ డ్యాన్సర్‌ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై డ్యాన్సర్‌ రమావత్‌ మాధురి రాథోడ్‌ ఫిర్యాదు చేయటంతో ఆగస్టు 22న కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశ్వర్‌సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాసింగ బలాలే జానపద నృత్యంలో నటించి ఈశ్వర్‌సాయి పాపులర్‌ అయ్యారు. ఈశ్వర్‌ సాయిపై మాధురి రాథోడ్‌  చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement