నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ దీంతో సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసే ఆలోచన లేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
18 years of entertaining.
And this year, the stage is all set to burn with #TheParadise 🔥🔥🔥
Natural Star @NameisNani as JADAL 💥#TheParadise GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼… pic.twitter.com/sGx22f8BIK— SLV Cinemas (@SLVCinemasOffl) September 5, 2026


