ప్రభాస్‌తో టాలీవుడ్ హీరో ఢీ.. పెద్ద సాహసమే..! | Vishwak sen legacy movie ready clash at Prabhas Pan India Movie Fauzi | Sakshi
Sakshi News home page

Fauzi Movie: ప్రభాస్‌తో టాలీవుడ్ హీరో ఢీ.. పెద్ద సాహసమే..!

Sep 6 2026 11:21 AM | Updated on Sep 6 2026 11:40 AM

Vishwak sen legacy movie ready clash at Prabhas Pan India Movie Fauzi

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రభాస్‌తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు మరో హీరో. రెబల్ స్టార్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు మాస్‌ కా దాస్ విశ్వక్ సేన్. ఆయన హీరోగా వస్తోన్న లెగసీ మూవీ డిసెంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఫౌజీ రిలీజైన ఒక్క రోజు గ్యాప్‌లోనే విశ్వక్ సేన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. దీంతో వీరిద్దరు బాక్సాఫీస్‌ వద్ద పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.

మరి ఫౌజీ ముందు లెగసీ మూవీ ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాల్సిందే. అయితే విశ్వక్ సేన్ ఒక్క రోజు గ్యాప్‌లోనే రావడం పెద్ద సాహసమనే చెప్పాలి. లేదంటే ఈ నిర్ణయం వెనుక నిర్మాతల పక్కా వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఫౌజీ అనుకున్న టైమ్‌కి రాకపోతే తమ సినిమాకు తిరుగుండదనే ఉద్దేశంతోనే ఈ డేట్‌పై కర్చీఫ్ వేసిందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న విశ్వక్ ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement