టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో సినిమా | Longest Title Movie In Telugu Cinema History | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో సినిమా

Sep 6 2026 8:47 AM | Updated on Sep 6 2026 8:47 AM

Longest Title Movie In Telugu Cinema History

‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, 'ఇదీ సంగతి', ‘ఆటగదరా శివా’ తదితర సినిమాలతో మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తీసిన లేటెస్ట్ మూవీ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇదే పొడవైన టైటిల్ అని చెప్పొచ్చు. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై సొంతగా ఈయనే నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ కథ అందించారు. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో  అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రలు చేశారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: అమ్మ చీరలే నా స్టైల్‌.. నివేతా థామస్‌ ఆసక్తికర విషయాలు)

‘ఆ నలుగురు’తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్.. ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మొట్టమొదటి మిస్టరీ మ్యూజికల్ మూవీ ఇది. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.

ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలని మేళవిస్తూ రూపొందిన ఈ హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది అని చంద్రసిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement