breaking news
Chandra Siddharth
-
టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో సినిమా
‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, 'ఇదీ సంగతి', ‘ఆటగదరా శివా’ తదితర సినిమాలతో మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తీసిన లేటెస్ట్ మూవీ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇదే పొడవైన టైటిల్ అని చెప్పొచ్చు. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై సొంతగా ఈయనే నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ కథ అందించారు. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రలు చేశారు. సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.(ఇదీ చదవండి: అమ్మ చీరలే నా స్టైల్.. నివేతా థామస్ ఆసక్తికర విషయాలు)‘ఆ నలుగురు’తో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్.. ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మొట్టమొదటి మిస్టరీ మ్యూజికల్ మూవీ ఇది. సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలని మేళవిస్తూ రూపొందిన ఈ హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది అని చంద్రసిద్ధార్థ్ చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
అప్పుడు సినిమాలు చేయకూడదనుకున్నా
‘‘చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకొస్తున్నా. సరైన కథ తోచక నిరాసక్తతలో ఉండి ఇక సినిమాలు చేయకపోవడమే బెటర్ అనుకుంటున్న టైమ్‌లో తనికెళ్ల భరణిగారు రాసిన ‘ఆటగదరా శివ’ పాట విన్నా. అది టైటిల్‌గా బావుంటుందనిపించింది. ఆ మరుసటిరోజే రాక్‌లైన్ వెంకటేశ్‌గారు ‘ఆటగదరా శివ’ సినిమా గురించి చెప్పారు. నాకూ రోడ్ ఫిల్మ్ చేయాలని కోరిక ఉండటంతో ఒప్పుకున్నా’’ అని దర్శకుడు చంద్రసిద్ధార్థ్ అన్నారు. ఉదయ్ శంకర్ కథానాయకుడిగా దొడ్డన్న, ‘హైపర్’ ఆది, దీప్తి, ‘చలాకీ’ చంటి, ‘చమ్మక్’ చంద్ర, భద్రం నటించిన చిత్రం ‘ఆటగదరా శివ’. ‘ఆ నలుగురు’ ఫేమ్ చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘కన్నడలో హిట్ అయిన ‘రామ రామ రే’ చిత్రానికి స్పిరిచ్యువల్ యాంగిల్‌ని, ఇంకో లేయర్‌ని కలగలిపి ‘ఆటగదరా శివ’ కథ సిద్ధం చేశా. పెద్ద పెద్ద సినిమాలు చేసే వెంకటేశ్‌గారు ఈ సినిమా తీయడం ధైర్యం చేయడమే. ఇది రాగిముద్దలాంటి సినిమా. అయినా మా నటీనటులు దాన్ని తినిపించేలా కష్టపడ్డారు’’ అన్నారు. ‘‘ఆటగదరా శివ’ నిర్మాతగా సంతృప్తినిచ్చింది. నటీనటులు, టెక్నీషియన్స్ ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ సినిమా కోసం కష్టపడ్డారు. వాసుకి సంగీతం బాగుంది. పులగం చిన్నారాయణ, చైతన్యప్రసాద్ రాసిన పాటలు బాగున్నాయి’’ అని రాక్‌లైన్ వెంకటేశ్ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారి బ్యానర్లో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. చంద్రసిద్ధార్థ్గారి డైరక్షన్లో చేయడం హ్యాపీ’’ అన్నారు ఉదయ్ శంకర్. ‘‘ఈ సినిమా కోసం ఆర్నెల్లు గడ్డం పెంచా’’ అన్నారు కన్నడ నటుడు దొడ్డన్న. -
తాతయ్య ఫొటో చూడగానే ఓకే చెప్పేశాను - సుమంత్
‘‘ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’లో తొలిసారి కామెడీ పాత్ర చేశాను. సుమంత్ కామెడీ కూడా బాగా చేయగలడు అని ఈ చిత్రం నిరూపించింది. నటునిగా నాకెంతో సంతృప్తి కలిగిస్తున్న విషయం ఇది’’ అని సుమంత్ అన్నారు. ఆయన కథానాయకునిగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో పూదోట సుధీర్‌కుమార్ నిర్మించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో సుమంత్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో ఆడవేషం వేయాలని చంద్రసిద్దార్థ్ చెప్పినప్పుడు కొంచెం ఆలోచించాను. ఇంటికెళ్లగానే... తొలినాళ్లలో తాతయ్య ఆడవేషం వేసిన నిలువెత్తు ఫొటో కనిపించింది. ఆ ఫొటో చూడగానే... ఇక ఆలోచించకుండా చంద్రసిద్దార్థ్కి ‘ఓకే’ చెప్పేశాను. రియల్ లైఫ్‌లో నా కేరక్టర్‌కి పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఇందులో నేను చేశాను. నిజంగా ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన పాత్ర ఇది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమకథ ఇదని, నేటి యువతరం మనోభావాలను ఇందులో చూపించామని చంద్రసిద్దార్థ్ అన్నారు. ‘‘వ్యాపారవేత్తగా ఇక్కడ కొన్ని రోజులు, విదేశాల్లో కొన్ని రోజులు ఉండే నా జీవితానికి ఈ కథ చాలా దగ్గర. నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది’’ అని నిర్మాత అన్నారు. కథానాయిక పింకీ సావిక, కథారచయిత ఎస్.ఎస్.కాంచి, గేయరచయిత చైతన్యప్రసాద్ తదితరులు కూడా మాట్లాడారు.


