రవితేజ సోదరుడి తనయుడు, రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మారెమ్మ’. దీపా బాలు హీరోయిన్‌గా నటించారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మయూర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న రిలీజ్ కానుంది. శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రవితేజ మాట్లాడుతూ– ‘‘తెలంగాణలోని మహిషాపురంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు.
ఈ సినిమా రఫ్ కట్ చూశాను... భలే నచ్చింది. ఎమోషన్స్ బాగున్నాయి. కుషాల్, మయూర్‌లకు ఈ సినిమాతో మంచి పేరు, డబ్బులు, సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. తమిళ అమ్మాయి దీపా తెలంగాణ భాష నేర్చుకుని, ఈ సినిమాలో బాగా పెర్ఫార్మ్ చేసింది. తొలి సినిమా అయినా నాగరాజు బాగా తీశారు. తమ్ముడు మాధవ్ బాగున్నావ్ రా.. ! ఈ సినిమా కోసం మాధవ్ ట్రాన్స్‌ఫార్మ్ అయిన తీరు బాగుంది. ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.
మాధవ్ భూపతిరాజు మాట్లాడుతూ– ‘‘ఆయన (రవితేజ) నాకు పెదనాన్న కాదు... నా అన్నయ్య. నా తొలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన రావడం హ్యాపీగా ఉంది. ఒక మనిషికి, ఒక దున్న΄ోతుకు మధ్య ఉన్న అనుబంధం తాలూకు ఎమోషన్‌ను ఊరి దైవం మారెమ్మతో కథలో చక్కగా బ్లెండ్ చేశారు నాగరాజుగారు. ఇందులో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది’’ అన్నారు. మయూర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘నాగరాజు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఇది మా ఊరి కథ అని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. మాధవ్ ఇలాంటి రూటెడ్ కథను ఎంచుకోవడం ఒక సాహసమే అని చెప్పాలి’’ అని చెప్పారు. మంచాల నాగరాజు మాట్లాడుతూ– ‘‘2006 టైమ్ ఫ్రేమ్‌లో ఈ సినిమా కథ సాగుతుంది’’ అన్నారు.


