ఆ బాధ ఎలా ఉండేదో చూశాను: ‘అల్లరి’ నరేశ్‌ | Ramba Oorvasi Menaka Grand Pre Release Event | Sakshi
Sakshi News home page

ఆ బాధ ఎలా ఉండేదో చూశాను: ‘అల్లరి’ నరేశ్‌

Sep 4 2026 12:50 AM | Updated on Sep 4 2026 12:50 AM

Ramba Oorvasi Menaka Grand Pre Release Event

విష్ణు ప్రియ, సురభి, నరేశ్, రాశీ సింగ్, ప్రిషా సింగ్, రాజేష్‌ దండా

‘‘చిత్ర పరిశ్రమలో చాన్స్‌లు రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మా నాన్నగారు (ఈవీవీ సత్యనారాయణ) కూడా ‘చెవిలో పువ్వు’ సినిమా తర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్నప్పుడు ఆ బాధ ఎలా ఉండేదో నేను చూశాను. చంద్రమోహన్‌గారు దర్శకుడు కావడానికి చాలా కష్టపడ్డారు. ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం నాకంటే చంద్రమోహన్‌గారి కోసం పెద్ద సక్సెస్‌ అవ్వాలి’’ అని ‘అల్లరి’ నరేశ్‌ తెలిపారు. 

చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, సురభి జంటగా నటించిన చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. అన్నపూర్ణ స్టూడియోస్‌–హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ–    ‘‘రంభ ఊర్వశి మేనక’తో హిట్టు సాధిస్తాం... సక్సెస్‌ మీట్‌ కూడా పెడతాం’’ అని చెప్పారు. 

‘‘నా తొలి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్‌లో చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు చంద్రమోహన్‌ చింతాడ. ‘‘ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్‌ కాబోతోందని అర్థమవుతోంది’’ అన్నారు నిర్మాత వై. రవిశంకర్‌. ‘‘మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను’’ అన్నారు నిమ్మకాయల ప్రసాద్‌. ‘‘థియేటర్‌ నుంచి బయటికి వెళ్లేటప్పుడు ప్రేక్షకులు ఫుల్లుగా నవ్వుకుంటూ వెళ్తారు. దానికి నేను గ్యారంటీ’’ అని రాజేష్‌ దండా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement