లుక్‌ ఫిక్స్‌ | Kamal Haasan has announced new film with director SU Arun Kumar | Sakshi
Sakshi News home page

లుక్‌ ఫిక్స్‌

Sep 4 2026 12:45 AM | Updated on Sep 4 2026 12:45 AM

Kamal Haasan has announced new film with director SU Arun Kumar

చేతిలో కత్తి, చురకత్తుల్లాంటి చూపులు... తన కొత్త చిత్రంలో కమల్‌హాసన్‌ ఓ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారని ఈ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది. ‘సేతుపతి, చిత్తా’ వంటి తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ఎస్‌.యు. అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌ లీడ్‌ రోల్‌లో రూపొందనున్న చిత్రంలోని లుక్‌ ఇది. 

త్వరలో చిత్రీకరణ ఆరంభించనున్న నేపథ్యంలో లుక్‌ టెస్ట్‌ చేశారు. ఫైనల్‌గా ఈ లుక్‌ని ఫిక్స్‌ చేశారు. కమల్, ఆర్‌. మహేంద్రన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ చిత్రంలో కమల్‌ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement