ఆల్ఫా ఫలితం.. అలాంటి సినిమాలకు శాపం: తాప్సీ పన్ను | Tollywood actress Taapsee Pannu about female Oriented Movies | Sakshi
Sakshi News home page

Taapsee Pannu: 'అలాంటి ఫలితాలు వస్తే మాకు కష్టమే'

Sep 6 2026 1:59 PM | Updated on Sep 6 2026 2:45 PM

Tollywood actress Taapsee Pannu about female Oriented Movies

హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలే గాంధారి మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రానికి దేవాశిష్‌ మఖీజా దర్శకత్వం వహించారు. ఫీమేల్ ఓరియంటెడ్‌ జానర్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే కథగా రూపొందించారు.

అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆలియా భట్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ ఆల్ఫా డిజాస్టర్ కావడంతో ఆ ప్రభావం మాపై కూడా పడుతుందని తెలిపింది. ఇలా జరిగితే మహిళ నేపథ్యంలో వచ్చే సినిమాలకు నిర్మాతలు ముందుకు రారంటూ మాట్లాడింది. మా సినిమాలన్నీ నిలిచిపోయే పరిస్థితి వస్తుందని తెలిపింది. దీంతో తాప్సీ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. తన కుమార్తె అదృశ్యమైన తర్వాత ఓ అంధ తల్లి సాగించే పోరాటం ఆధారంగా తీర్చిదిద్దారు. ఈ మూవీలో ఇష్వాక్‌ సింగ్‌, జతిన్‌ సర్నా, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్‌, ఛాయా కదమ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement