అల్లు అర్జున్‌ రాకా.. ప్రముఖ నటుడి రోల్‌ రివీల్..! | Babloo Prithiveeraj Reveals his Role In allu arjun Raaka Movie | Sakshi
Sakshi News home page

Raaka Movie: అల్లు అర్జున్‌ రాకా.. ప్రముఖ నటుడి రోల్‌ రివీల్..!

Sep 6 2026 3:02 PM | Updated on Sep 6 2026 3:26 PM

Babloo Prithiveeraj Reveals his Role In allu arjun Raaka Movie

ఐకాన్ స్టార్ ‍అల్లు అర్జున్ నటిస్తోన్న భారీ యాక్షన్‌ మూవీ రాకా. ఈ సినిమాకు అల్లు అర్జున్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ముంబయిలో పూర్తి చేసుకుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌(బబ్లూ) కీలక పాత్ర పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  ఈ ప్రాజెక్ట్‌లో తనకు ఒక ప్రత్యేకమైన లుక్‌తో కూడిన కీలక పాత్ర దక్కిందని రివీల్ చేశారు. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం అదృష్టమని.. అంతేకాకుండా అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడంతో తన కల సాకారమైందని స్పష్టం చేశారు.

కాగా.. ఈ సినిమాలో దీపిక పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్‌గా కనిపించనుంది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్‌ చేయనున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement