నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు.
చదవండి: సిద్ధూని పొగిడిన బ్రహ్మానందం.. నవ్వులు పూయించిన సుమ

అయితే సోషల్ మీడియాలో రిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు రావడంతో మూవీ విడుదల విషయంలో ఎలాంటి మార్పూ లేదని చిత్ర బృందం మరోసారి ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబరు 24న రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసింది. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేయనున్నారు.


