బిగ్‌బాస్‌లో మొదలైన రచ్చ.. దేనికోసమంటే..? | Bigg Boss 10 Telugu First Day Drama Begins With Heated Arguments | Sakshi
Sakshi News home page

Bigg Boss10 Telugu: బిగ్‌బాస్‌లో మొదలైన గొడవ.. దేనికోసమంటే..?

Sep 7 2026 12:27 PM | Updated on Sep 7 2026 12:35 PM

Bigg Boss 10 Telugu First Day Drama Begins With Heated Arguments

బిగ్‌బాస్‌ సీజన్‌ 10లో అసలు ఆట మొదలైనట్టే కనిపిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్‌లో తొలినాళ్లలోనే విభేదాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. సోమవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం ఆసక్తిని పెంచుతోంది.
బిగ్‌బాస్‌ సూచనల మేరకు..
తొలి టాస్క్‌లో భాగంగా ఇప్పటికే ఎనిమిది మంది కంటెస్టెంట్లు కీలను సొంతం చేసుకున్నారు. మిగిలిన వారిలో మరో ఇద్దరికి ఆ రెండు కీలను ఎవరు ఇవ్వాలనేది నిర్ణయించుకోవాలని బిగ్‌బాస్‌ సూచించినట్లు ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఎవరికి ఆ అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది.

మరోవైపు కీల విషయంలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముకేశ్‌.. రాంప్రసాద్‌, త్రిగుణ్‌తో వాదిస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది. ‘నాకు అన్నీ తెలిసినట్లు ముందే వెళ్లిపోవడానికి తొందరపడ్డారు’ అంటూ ముఖేశ్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?

మీతో ఆడితే గెలవచ్చు..
ఇక త్రిగుణ్‌ మరో టీమ్‌తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రోమోలో కనిపించాయి. ‘మీతో ఆడితే గెలవచ్చు’ అంటూ టెంపర్‌ వంశీని త్రిగుణ్ దూరం పెట్టినట్లుగా చూపించారు. దీంతో హౌస్‌లో గ్రూపులు ఏర్పడుతున్నాయా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఆ రెండు కీలను ఎవరికి ఇస్తారు? కీలక నిర్ణయం ఎవరికి అనుకూలంగా మారుతుంది? తెలియాలంటే ఈరోజు జగరబోయే పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

ఇదీ చదవండి: టాలీవుడ్ 'చిన్న' హీరో.. బిగ్‌బాస్ 10లోకి వచ్చేశాడు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement