‘గుప్పెడంత మనసు' రిషి సర్.. బిగ్‌బాస్‌ 10లోకి ఆగయా | Bigg Boss 10 Telugu Mukesh Gowda Latest Details | Sakshi
Sakshi News home page

Bigg Boss 10: బిగ్‌బాస్‌ 10లోకి ఎంట్రీ ఇచ్చిన సీరియల్‌ నటుడు

Sep 6 2026 10:36 PM | Updated on Sep 6 2026 11:04 PM

Bigg Boss 10 Telugu Mukesh Gowda Latest Details

ప్రతిసారి సీరియల్ బ్యాచ్ నుంచి కచ్చితంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పలువురు నటీనటులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈసారి అలా 'గుప్పెడంత మనసు' రిషి సర్( ముకేశ్ గౌడ) వచ్చేశాడు.  చివరి కంటెస్టెంట్‌గా లోపల అడుగుపెట్టేశాడు.

రెండేళ్ల క్రితం వరకు తెలుగులో ప్రసారమైన 'గుప్పెడంత మనసు' సీరియల్.. ఎంతలా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోనే రిషిగా చేసిన ముకేశ్ గౌడ తన సొంత పేరు కంటే సీరియల్ పేరుతోనే బోలెడంత పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా కన్నడ కుర్రాడు అయినప్పటికీ తెలుగులో ఇతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కన్నడలో హీరోగా ఓ మూవీ, తెలుగులో 'గీతా శంకరం' అనే చిత్రం చేశాడు. కాకపోతే అవేమంత పేరు తీసుకురాలేదు.

గతంలోనే ఓసారి తెలుగు, ఇంకోసారి కన్నడ బిగ్‌బాస్ షో నుంచి ఇతడికి అవకాశాలు వచ్చాయి. కానీ అప్పట్లో గేమ్, షో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల నో చెప్పానని ఓ ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడ స్వయంగా చెప్పాడు. ఇప్పుడు క్రేజీ కంటెస్టెంట్‌గా 10వ సీజన్‌లో అడుగుపెట్టాడు. తెలుగు సీరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న దృష్ట్యా ఇతడికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకుంటాడనేది రాబోయే వారాల్లో తెలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement