శారీరక లోపం వరమైతే.. బిగ్‌బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్ | Bigg Boss 10 Telugu Jabardasth Naresh Latest Details | Sakshi
Sakshi News home page

Jabardasth Naresh: పొట్టోడే కానీ గట్టోడు.. బిగ్‌బాస్ హౌస్‌లోకి నరేశ్

Sep 6 2026 9:38 PM | Updated on Sep 6 2026 9:59 PM

Bigg Boss 10 Telugu Jabardasth Naresh Latest Details

ప్రతిసారి బిగ్‌బాస్ షోలోకి కమెడియన్స్ వస్తూనే ఉంటారు. ఈసారి ఆ కోటాలో పొట్టి నరేశ్ అలియాస్ కమెడియన్ నరేశ్ ఎంట్రీ ఇచ్చాడు. గత పదేళ్లుగా పలు షోలతో అలరిస్తున్న ఇతడు.. ఇప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదంతో బిగ్‌బాస్ 10లోకి   11వ కంటెస్టెంట్‌గా  ఎంట్రీ ఇచ్చాడు.

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర షోల్లో కనిపించే నరేశ్.. తన ఆహార్యం వల్లే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పొట్టిగా ఉన్నప్పటికీ దానినే తన బలంగా మార్చుకుని పంచులేస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే 600కి పైగా స్కిట్స్ చేశాడు. రూ.500 పారితోషికంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు షోలు, ఈవెంట్స్ చేస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

నరేశ్ కుటుంబం విషయానికొస్తే ఇతడి తండ్రికి ట్రాలీ ఆటో ఉండేది. వీళ్ల కుటుంబం స్క్రాప్‌ దుకాణం బిజినెస్ చేసేది. అంటే పేపర్లు, ఇనుప సామాన్లు, మందు సీసాలని జనాల దగ్గర కొని వాటిని అమ్ముకుని జీవనం సాగించేవారు. కుటుంబ పరిస్థితుల కారణంగా తొమ్మిదో తరగతి వరకే చదువుకున్న నరేశ్.. ఓ సందర్భంలో ఢీ జూనియర్స్‌ ఆడిషన్స్‌కు వెళ్లాడు. అక్కడే పరిచయమైన ఓ వ్యక్తి ఇతడిని జబర్దస్త్‌కి తీసుకెళ్లాడు. అలా ఆ కామెడీ షోలో సెటిలైపోయాడు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్, కెవ్వు కార్తీక్.. ఇలా చాలామంది టీమ్స్‌లో ఎన్నెన్నో కామెడీ పాత్రలు చేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement