స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..? | Naresh, Ram Prasad Entered in Bigg Boss 10 Telugu - Will Friendship Turn Into Rivalry? | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?

Sep 7 2026 10:53 AM | Updated on Sep 7 2026 11:59 AM

Naresh, Ram Prasad Entered in Bigg Boss 10 Telugu - Will Friendship Turn Into Rivalry?

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ 10వ సీజన్‌ నిన్న (ఆదివారం) గ్రాండ్‌గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా సందడి చేశాడు.  ఈ సారి మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌ పాల్గొన్నారు. వారిలో సెలెబ్రెటీ కోటా నుంచి 10 మంది, కామనర్స్‌ నుంచి 6 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రేక్షకుల కళ్లన్నీ ఆ ఇద్దరి కంటెస్టెట్లపైనే పడింది. 
వాళ్లే రాంప్రసాద్‌, నరేశ్‌లు. బుల్లితెరపై తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించిన నరేశ్‌, రాంప్రసాద్‌ మంచి స్నేహితులు. ఇప్పుడు వీరిద్దరూ  బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టారు. బయట మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. హౌస్‌లో మాత్రం ఎలా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది.
బిగ్‌బాస్‌ విషయానికి వస్తే..
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత సంబంధాల కంటే ఆటకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. టాస్కులు, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీలు వంటి అంశాలు హౌస్‌మేట్స్‌ మధ్య విభేదాలకు కారణమవుతుంటాయి. ఈ నేపథ్యంలో నరేశ్‌, రాంప్రసాద్‌ మధ్య స్నేహం ఆటను ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ కలిసి ఉంటే హౌస్‌లో మంచి కామెడీ పండే అవకాశం ఉంది. ఒకరి బలహీనతలు, మరొకరి ప్లస్‌ పాయింట్లు ఇద్దరికీ బాగా తెలుసు కాబట్టి.. వారి మధ్య సంభాషణలు, సరదా పంచ్‌లు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారొచ్చు.

ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 10: హాట్‌ టాపిక్‌గా నాగార్జున రెమ్యునరేషన్‌

భేదాభిప్రాయాలు రావడం..
అయితే బిగ్‌బాస్‌ అంటేనే అనూహ్య పరిణామాలకు కేరాఫ్‌. ఒక టాస్క్‌లో పోటీ పడటం, నామినేషన్‌ సమయంలో ఒకరిపై మరొకరు అభిప్రాయం చెప్పాల్సి రావడం, ఇంట్లో నిర్ణయాల విషయంలో భేదాభిప్రాయాలు రావడం.. ఇలా ఏదైనా వారి మధ్య చిన్నపాటి మనస్పర్థకు దారితీయొచ్చు.
ఇదీ చదవండి: శారీరక లోపం వరమైతే.. బిగ్‌బాస్ 10 లోకి కమెడియన్ నరేశ్
ఒకవేళ గొడవ జరిగితే?
ఇదే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. బయట మంచి స్నేహితులైన వీరిద్దరూ హౌస్‌లో గొడవ పడితే.. ఆ తర్వాత వెంటనే కలిసిపోతారా? లేక ఆట కోసం తమ స్నేహాన్ని పక్కన పెడతారా? అన్నది చూడాలి. ముఖ్యంగా ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తి అవగాహన ఉండటంతో.. వాదన జరిగితే అది మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. అయితే వీరిద్దరి స్నేహమే హౌస్‌లో బలంగా మారుతుందా? లేక బిగ్‌బాస్‌ ఆట వారి స్నేహానికి పరీక్షగా నిలుస్తుందా? అనేది బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఇదీ చదవండి: బిగ్‌బాస్'లోకి ఆటో రాంప్రసాద్.. అవినాష్, ఇమ్ములా మెప్పిస్తాడా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement