గత ఏడాది నవంబరులో జరిగిన ‘వారణాసి’ ఫస్ట్ గ్లింప్స్ ఈవెంట్‌ని గుర్తు చేసుకుంటే... ఆ వేడుకలో మహేశ్‌బాబు ఒక మెకానికల్ బుల్‌పై కూర్చుని వేదిక మీదకు వచ్చిన విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... బుల్‌తో ఫైట్ చేయడానికి మహేశ్‌బాబు సిద్ధం అవుతున్నారట. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌లో మహేశ్‌బాబు పాత్రకు సంబంధించిన ఎలివేషన్ షాట్‌లో బుల్ విజువల్ కూడా కనిపించింది.
ఇప్పుడు ఈ ఫైట్ చిత్రీకరణ కోసమే హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ని రూపొందించారని సమాచారం. ఈ ఫైట్ షూట్‌కి కావాల్సిన సన్నాహాలు చేస్తున్నారట చిత్రదర్శకుడు రాజమౌళి. ఈ వారంలో ఈ ఫైట్ చిత్రీకరణను ఆరంభించనున్నారని తెలిసింది. ‘వారణాసి’ సినిమాకి హైలైట్స్‌గా నిలిచేవాటిలో ఈ ఫైట్‌ది ప్రముఖ స్థానం అని టాక్.
ఇక పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో ఎస్‌ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


