యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. రిలీజైన రెండు రోజులకే బిగ్ స్క్రీన్‌పై నుంచి కనుమరుగైంది.
ఇదంతా పక్కనపెడితే ఈ చిత్రానికి మహేశ్ బాబు తనయుడు గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. ఇప్పుడిదే టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. లెటర్ బాక్స్ డీ అనే ఖాతాలో పలు సినిమాలకు గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. ఇందులో మహేశ్ బాబు నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే టాక్సిక్ మూవీకి ఏకంగా 0.5 రేటింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాకుండా తన తండ్రి మహేశ్ బాబు సినిమాలకు తక్కువ రేటింగ్స్ కనిపించడం ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం కలిగించింది. ఇది కాస్తా నెట్టింట మరింత చర్చకు దారితీసింది. కొందరు అభిమానులు అతని రేటింగ్స్ నిజాయితీగా ఉన్నాయని చెప్పగా.. మరికొందరు వాటిని మరింత కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ లెటర్ బాక్స్ డీ ప్రొఫైల్‌లో దాదాపు 400కు పైగా సినిమాలకు రేటింగ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు 'పోకిరి', '1: నేనొక్కడినే' సినిమాలైన గౌతమ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో 'నిజం', 'వంశీ' చిత్రాలకు 2 స్టార్ ఇవ్వగా.. 'బ్రహ్మోత్సవం' చిత్రానికి కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాడు. టాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాదు.. 'షోలే', 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ', 'నైవ్స్ అవుట్', 'జెర్సీ' చిత్రాలకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. 'ది ఒడిస్సీ', 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' లాంటి సినిమాలకు 4.5 స్టార్ ఇచ్చాడు.

అంతేకాకుండా బాహుబలి- 2 సినిమాకు 5 స్టార్.. పెళ్లి చూపులు, సీతా రామం చిత్రాలకు 4.5 స్టార్ ఇచ్చేశాడు. ఈగ మూవీకి 4 స్టార్ ఇవ్వగా.. ధురందర్-1కి 4 స్టార్, ధురందర్- 2కి 3 స్టార్ ఇచ్చాడు. రవి తేజ నటించిన ఇటీవలి తెలుగు హిట్ చిత్రం ఇరుముడికి 3 స్టార్ ఇవ్వగా.. లోకేష్ కనగరాజ్ 'డీసీ'కి 4 స్టార్ రేటింగ్ రాసుకొచ్చాడు. 'టాక్సిక్' లాగే 'లైగర్'కు కూడా 0.5 స్టార్ ఇస్తూ.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీకి 2.5 స్టార్ రేటింగ్స్ ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


