స్టైలిష్‌ లుక్‌లో ప్రియాంక చోప్రా.. ఈ డ్రెస్‌ ఎన్ని లక్షలంటే.. | Priyanka Chopra Stuns In A Black Maxi Dress How Much Cost | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ లుక్‌లో ప్రియాంక చోప్రా.. ఈ డ్రెస్‌ ఎన్ని లక్షలంటే..

Aug 24 2026 1:21 PM | Updated on Aug 24 2026 1:27 PM

Priyanka Chopra Stuns In A Black Maxi Dress How Much Cost

న్యూయర్క్‌లో జరిగిన ‘ది సైకిల్‌ ఆఫ్‌ లవ్‌’ ప్రీమియర్‌లో బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా తన స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంది. పూర్తిగా బ్లాక్‌ అవుట్‌ఫిట్‌లో కనిపించిన ఆమె.. తన సిగ్నేచర్‌ ఎలిగెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. 
ప్రియాంక ధరించిన ఈ డ్రెస్‌..
ప్రియాంక ధరించిన అవేక్‌ మోడ్‌( Awake mode) బ్లాక్‌ మ్యక్సీ డ్రెస్‌ అసలు ధర దాదాపు రూ.14.2 లక్షలు ఉంటుందట. అయితే ప్రస్తుతం ఇది రూ.90 వేలకే దొరుకుతోందని సమాచారం. 
సినిమాల విషయానికి వస్తే..
ఇక ‘ది సైకిల్‌ ఆఫ్‌ లవ్‌’ విషయానికి వస్తే 1977లో  తన ప్రేమను కలుసుకునేందుకు దాదాపు 6000 మైళ్లు సైకిల్‌పై ప్రయాణించిన పీకే మహానందియా జీవిత ప్రయాణాన్ని తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది. ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా సహ నిర్మాతగా వ్యవహరించింది.

కాగా.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబుతో కలిసి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనుంది. 

 ఇదీ చదవండి: ఇన్నాళ్లకు కనిపించిన రష్మిక..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement