ఇన్నాళ్లకు కనిపించిన రష్మిక.. | Rashmika Makes Public Appearance With Vijay Deverakonda | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లకు కనిపించిన రష్మిక..

Aug 24 2026 12:01 PM | Updated on Aug 24 2026 12:12 PM

Rashmika Makes Public Appearance With Vijay Deverakonda

తుంటి గాయం కారణంగా కొద్ది రోజుల నుంచి ఇంటికే పరిమితమైంది హీరోయిన్‌ రష్మిక. అయితే ఇప్పుడు తన భర్త విజయ్‌ దేవరకొండతో కలిసి హైదరాబాద్‌లోని ఓ వివాహ వేడుకకు హజరై అభిమానులను ఆశ్చర్యపరిచింది. వీరిద్దరు నిర్మాత నిరంజన్‌ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రష్మికకు గాయం..
రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక చేస్తున్న యాక్షన్‌ సినిమా ‘మైసా’. ఇందులో గోండు తెగకు చెందిన మహిళగా రష్మిక కనిపించనుంది. ఓ పాట షూటింగ్‌ చేస్తుండగా ఈమెకు బలమైన గాయమైంది. దీంతో వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

పెళ్లి తర్వాత తొలి చిత్రం..
టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకుడు. తొలిత ఈ సినిమా సెప్టెంబర్‌ 11న రిలీజ్‌ చేయాలని భావించినప్పటికీ రష్మికకు గాయం కావడంతో విడుదల తేదీని అక్టోబర్‌ 30కి మార్చినట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. 

 ఇదీ చదవండి: విడుదలకు ముందే ‘టాక్సిక్‌’ కలెక్షన్ల వర్షం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement